ఒకరు రోజుకి రూ.1 కోటి, ఇంకొకరు రోజుకి రూ.10 కోట్లు.. సల్మాన్ నుంచి నాగ్ వరకు బిగ్ బాస్ రెమ్యునరేషన్ లిస్ట్

Published : Aug 03, 2025, 11:58 AM IST

సల్మాన్ ఖాన్, నాగార్జున, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోలు బిగ్ బాస్ షో కోసం ఎంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారో ఇక్కడ తెలుసుకోండి. 

PREV
16
బిగ్ బాస్ రెమ్యునరేషన్ లిస్ట్

ఇండియాలో బిగ్ బాస్ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ రియాలిటీకి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా ఆదరణ ఉంటోంది. అయితే బిగ్ బాస్ షోలో కొంత స్క్రిప్టెడ్ కూడా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. కానీ ఈ విమర్శలని బిగ్ బాస్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ షోని వివిధ భాషల్లో టాప్ స్టార్లు హోస్ట్ చేస్తున్నారు. దీనితో వారి ఫ్యాన్స్ లో బిగ్ బాస్ పై ఆసక్తి ఉంటుంది. అదే విధంగా కంటెస్టెంట్స్ గా సినిమా రంగంలో, టీవీ రంగంలో, సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన వారు పాల్గొంటుంటారు.  హౌస్ లో జరిగే వివాదాలు, కంటెస్టెంట్స్ ఆడే గేమ్స్, టాస్కులు, మాటల యుద్ధం, భావోద్వేగాలు చెలరేగడం లాంటి అంశాలు బిగ్ బాస్ షోపై ఆసక్తిని పెంచేశాయి. ఈ షోకి ఉన్న క్రేజ్ కి తగ్గట్లుగానే హోస్ట్ లు భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు.సల్మాన్ ఖాన్, నాగార్జున, కిచ్చా సుదీప్, మోహన్ లాల్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి లాంటి బిగ్ బాస్ హోస్ట్ ల రెమ్యూనరేషన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

DID YOU KNOW ?
మహిళలకి ఒక్క టైటిల్ కూడా దక్కలేదు 
ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ తెలుగు 8 సీజన్లలో ఒక్క మహిళా కంటెస్టెంట్ కూడా విజేతగా నిలవలేదు. టైటిల్స్ మొత్తం పురుషులకే దక్కాయి. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షోలో మాత్రం బిందుమాధవి విజేతగా నిలిచింది. 
26
సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ కి ఇటీవల సరైన బాక్సాఫీస్ హిట్ లేదు. కానీ బుల్లితెరపై బిగ్ బాస్ షోతో మాత్రం దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ హిందీ 19 షో ఆగష్టు 24 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ 19 షోకి సల్మాన్ ఖాన్ 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. సల్మాన్ ఖాన్ వీకెండ్ లో శని, ఆది వారాల్లో షోలో పాల్గొంటారు. కేవలం వీకెండ్ కోసం సల్మాన్ ఖాన్  దాదాపు 20 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్క రోజుకి 10 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. 

36
విజయ్ సేతుపతి

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 7 వరకు కమల్ హాసన్ హోస్ట్ గా చేశారు. కమల్ హాసన్ ఈ షోకి 130 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. సీజన్ 8 కి మాత్రం కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. దీనితో కమల్ హాసన్ స్థానంలోకి విజయ్ సేతుపతి వచ్చారు. విజయ్ సేతుపతి సీజన్ 8కి గాను 60 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం.

46
నాగార్జున అక్కినేని

బిగ్ బాస్ తెలుగు షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. తొలి రెండు సీజన్ లకు ఎన్టీఆర్, నాని హోస్ట్ గా చేశారు. మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా కంటిన్యూ అవుతున్నారు. సీజన్ 9కి కూడా ఆయనే హోస్ట్. ఈ షోకి నాగార్జున 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. వీకెండ్ కి నాగార్జున 2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఒక్క రోజుకి రూ.1 కోటి నాగార్జున రెమ్యునరేషన్.

56
కిచ్చా సుదీప్ 

కన్నడ బిగ్ బాస్ షో కోసం హోస్ట్ గా కిచ్చా సుదీప్ 20 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. కన్నడ బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సుదీప్ హోస్ట్ గా కొనసాగుతున్నారు.  

66
మోహన్ లాల్ 

బిగ్ బాస్ మలయాళం షోకి మోహన్ లాల్ హోస్ట్ గా చేస్తున్నారు. సీజన్ 1 నుంచి ఆయనే హోస్ట్. ఒక్కో సీజన్ కి మోహన్ లాల్ 18 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories