కృష్ణ ను హీరోగా సెలెక్ట్ చేసిన మరో హీరో ఎవరో తెలుసా? సూపర్ స్టార్ చెప్పిన రహస్యం.

Published : Aug 03, 2025, 08:11 AM IST

తెలుగు సినీ పరిశ్రమలో రికార్డ్ ల రారాజు గా కృష్ణకు పేరుంది. ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ నిన్ని కావు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణను హీరోగా సెలక్ట్ చేసిన మరో మరో హీరో ఎవరో మీకు తెలుసా? 

PREV
17

కాలేజీ రోజుల్లో ఎన్టీఆర్ కు వీరాభిమాని

టాలీవుడ్ పాతతరం హీరోలలో సూపర్ స్టార్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తెలుగు ఇండస్ట్రీలో తన మార్క్ చూపించారు. ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేశారు. టాలీవుడ్ కు టెక్నాలజీని ప్రరిచయం చేశారు. హీరోగా ఆయన క్రియేట్ చేసిన రికార్డ్ లు అన్నీ ఇన్నీ కావు. ఇక కృష్ణ పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఆయన తల్లీ తండ్రులు వీరరాఘవయ్య, నాగరరత్నమ్మ. నలుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత ఈపేరు చాలాపెద్దగా ఉందన్న కారణంగా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరును కృష్ణగా మార్చారు. సినిమాల్లోకి రాకముందు కాలేజీ రోజుల్లో ఎన్నో నాటకాల్లో కృష్ణ నటించారు. 1960లో చేసిన ఓ నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు తాను ఎన్టీఆర్‌కు అభిమానినని, ఆయన సినిమా పాతాళభైరవి అంటే చాలా ఇష్టమని కృష్ణ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. అయితే ఆ తరువాత కాలంలో ఎన్టీఆర్ తో విబేధించారు కృష్ణ. ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు కూడా తీసి సంచలనం సృష్టించారు.

DID YOU KNOW ?
కృష్ణ సినిమా వల్ల 144 సెక్షన్
టాలీవుడ్ లో ఎన్నో ప్రయోగాలు చేశారు కృష్ణ. తెలుగు సినిమాకు కలర్ ప్రింట్ ను పరిచయం చేసింది ఈ హీరోనే. ఇక కృష్ణ సింహాససం సినిమా రిలీజ్ కు అభిమానుల తాకిడి తట్టుకోలేక విజయవాడలో ఏకంగా 144 సెక్షన్ పెట్టారు. టికెట్ ఉంటేనే ఆ వీధిలోకి అనుపతించే వారు.
27

కృష్ణను హీరోగా సెలక్ట్ చేసిన అక్కినేని నాగేశ్వరావు.

కృష్ణ 8 ఏళ్ల వయస్సులో అక్కినేని నాగేశ్వరావు దేవదాసు సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా 1‌00 రోజులు వేడుకలకు ఏఎన్నార్, సావిత్రి తెనాలి వాచ్చారు. అప్పుడు వారిని కృష్ణ చూశారు. ఇక అప్పటి నుంచి పలు సందర్భాల్లో అక్కినేనిని కృష్ణ చూశారు. కాని తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను మాత్రం కృష్ణ సినిమాల్లోకి రాకముందు చూడలేకపోయారట. ఇక కాలేజీ రోజుల్లో ఎఎన్నార్ కు బయట ఉన్న క్రేజ్ చూసి ఎలాగైనా హీరో అవ్వాలని అనుకున్నారు కృష్ణ. ఇక ఏలూరులో కాలేజీ అయిపోయిన తరువాత హీరో అవ్వాలని ప్రయత్నించినప్పుడు, అనుకోకుండా ఆయన మొదటి సినిమాకు ఏఎన్నార్ కారణం అయ్యారు.

కృష్ణ మొదటి సినిమా తేనెమనసులు. ఈ సినిమాకు దర్శకుడు ఆదరుర్తి సుబ్బారావు. ఈసినిమాకోసం కృష్ణ ఫోటోలు పంపించారు. అప్పుడు హీరోను సెలక్ట్ చేయడంలో ఆదుర్తి సుబ్బారావు ఏఎన్నార్ సలహాలు తీసుకున్నారు. ఈసినిమా కోసం చాలా ఫోటోలు వచ్చాయి. కాని అందరిలో అక్కినేని కృష్ణనే సెలక్ట్ చేశారు. ఈ రకంగా అక్కినేని నాగేశ్వరావు వల్లే కృష్ణ తేనెమనసులు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్నిసూపర్ స్టార్ కృష్ణ అక్కినేని 75 సంవత్సరాలు సినిమా వేడుకల్లో వెల్లడించారు. అప్పుడు తనను హీరోగా సెలక్ట్ చేసింనందుకు ఏఎన్నార్ కు కృష్ణ కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు.

37

టాలీవుడ్ లో కృష్ణ కుటుంబం

1962లో మేనమామ కూతురు ఇందిరాదేవితో కృష్ణకు వివాహమైంది. ఈ దంపతులకు రమేష్ బాబు, మహేష్ బాబు కుమారులతో పాటు పద్మావతి, మంజుల, ప్రియదర్శని అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రమేష్ బాబు హిరోగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించారు. కాని ఆతరువాత ఆయన కెరీర్ పై దృష్టిపెట్టకపోవడంతో అవకాశాలు రాలేదు. కొంత కాలం నిర్మాతగా కోనసాగిన రమేష్ బాబు, తరువాతి కాలంలో ఇండస్ట్రీకి దూరం అయ్యారు. రీసెంట్ గానే ఆయన కన్నుమూశారు. ఇక రెండో తనయుడు మహేష్ బాబు. కృష్ణ నటవారసత్వం కొనసాగిస్తూ.. టాలీవుడ్ సూపర్ స్టార్ గా కోనసాగుతున్నారు. కృష్ణ కుమార్తెలలో మంజుల ఒక్కరు నటన వైపు వచ్చారు. ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇక కృష్ణ చిన్న అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా కోనసాగుతున్నారు. కృష్ణ పెద్ద కూతురు కొడుకు అశోక్ గల్లా కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా కృష్ణ వారసులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

47

సూపర్ స్టార్ రెండు పెళ్లిల్లు

ఇందిరతో వివాహమైన నాలుగేళ్లకు 1969లో విజయనిర్మలతో కృష్ణకు రెండో వివాహమైంది. దాదాపు 48 సినిమాల్లో విజయనిర్మలతో కలిసి ఆయన నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహాం పెళ్లి వరకు దారి తీసింది. విజయనిర్మల డైరెక్షన్‌లో కృష్ణ చాలా సినిమాల్లో నటించారు. విజయ నిర్మలకు కృష్ణతో పెళ్లికి ముందే ఓ కుమారుడు ఉన్నారు. ఆయన టాలీవుడ్ స్టార్ నటుడు నరేష్. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

57

టాలీవుడ్ రికార్డుల రారాజు సూపర్ స్టార్ కృష్ణ

కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ రాణించారు. 16 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. నిర్మాతగా వివిధ భాషల్లో 50కి పైగా సినిమాలను నిర్మించారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ హీరో కృష్ణ. అంతే కాదు దాదాపు 80కిపైగా హీరోయిన్లతో నటించిన రికార్డు కూడా కృష్ణదే. విజయనిర్మలతో 48, జయప్రదతో 47, శ్రీదేవితో 31, రాధతో కలిసి 23 సినిమాల్లో జంటగా నటించారు సూపర్ స్టార్. 25 సినిమాల్లో ద్విపాత్రాభినయం, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసిన అరుదైన రికార్డు కూడా కృష్ణపేరునే ఉంది. అంతే కాదు టాలీవుడ్ లో ఎన్టీఆర్,ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజులతో ఎక్కువ మల్టీస్టారర్ సినిమాల్లో కృష్ణ నటించారు.

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు, సంచలనాలు సృష్టించిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే చెందుతుంది. ఆయన పరిచయం చేసిన టెక్నాలజీ, సినిమాల్లో ప్రయోగాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. టాలీవుడ్ లో టెక్నికల్‌గా చూస్తే తొలి కలర్ సినిమా, ఫస్ట్ ఫుల్ స్కోప్ మూవీ, తొలి స్టీరియో సౌండ్ టెక్నాలజీ, ఫస్ట్ R/O టెక్నాలజీ సినిమాలు అన్నీ కృష్ణ పరిచయం చేసినవే. టాలీవుడ్ లో ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ సినిమాలు కూడా కృష్ణ హీరోగానే చేశారు. సినిమాల్లో కృష్ణ చేసిన సాహసాలు ఇంకెవరు చేయలేరు అని అంటారు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్, అడ్వెంచర్ సీన్స్ చేసిన ఘనత కూడా సూపర్ స్టార్ ఖాతాలోనే ఉంది. ఒకే ఏడాది 18 సినిమాలు చేసిన రికార్డ్ కూడా కృష్ణదే. ఇవే కాకుండా ఆయన సినిమాలు టాలీవుడ్ లో సృష్టించిన రికార్డులెన్నో ఉన్నాయి.

67

సూపర్ స్టార్ ను వరించిన అవార్డులు

కృష్ణ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసిన సేవలకు ఎన్నో అవార్డులు రివార్డ్ లు ఆయన్ను వరించాయి. 1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకోగా.. 1976లో కేంద్ర కార్మికశాఖ నటశేఖర్ అనే బిరుదుతో ఆయనను సత్కరించింది. 1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సౌఫల్య పురస్కారం కృష్ణకు దక్కింది.2000లో కృష్ణకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించగా.. 2009లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. పేరుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. అయితే పద్మ అవార్డు వెనుకు ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనకు ఇంతక వరకూ పద్మ అవార్డు లేదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి.. పద్మాఅవార్డుల్లో తన పేరును రాయించారని కృష్ణ ఓ సంరద్భంలో చెప్పుకొచ్చారు.

77

రాజకీయ నాయకుడిగా కృష్ణ

నటుడు, దర్శకుడు, నిర్మాతగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూగా కృష్ణ సేవలు అందించారు. 1972 జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించిన కృష్ణ.. 1984లో రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో తాను చదువు పూర్తి చేసుకున్న ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. రాజీవ్‌గాంధీ మరణంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, కృష్ణ మధ్య విబేధాలు వచ్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories