
తెలుగు సినిమా చరిత్రలో స్నేహానికి గుర్తుగా నిలిచారు బాపు, రమణలు. చిన్ననాటి నుంచి స్నేహితులైన వీరిద్దరు కలసి అనేక చారిత్రక సినిమాలను నిర్మించారు. బాపు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో రమణ రచన కనిపించేది. ముత్యాలముగ్గు, సంపూర్ణ రామాయణం, భక్త కన్నప్ప వంటి చిత్రాలు వీరి కలయిక ఫలితమే. రమణ మరణించిన మూడు సంవత్సరాల తరువాత బాపు కూడా ఈ లోకాన్ని విడిచారు.
పవన్ కల్యాణ్ ఎంతో కొద్దిమందిని మాత్రమే సన్నిహితంగా కలిసే వ్యక్తి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఆయన స్నేహం ప్రత్యేకమైనది. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, భీమ్లా నాయక్ వంటి సినిమాలు త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ నటించారు. త్రివిక్రమ్ పవన్ సినిమాల కథ, మాటల పైన ఎంతో ప్రభావం చూపారు. ఎన్నో సందర్భాల్లో తివిక్రమ్ గురించి, తమ స్నేహం గురించి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
రామ్ చరణ్, శర్వానంద్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరు కొన్ని విషయాల్లో ఒకే రకమైన ఆలోచన కలిగి ఉంటారు. మరీ ముఖ్యంగా భక్తిలో ఇద్దరిది ఒకటే రూటు. ఇద్దరు అయ్యప్ప మాల ధరించి ఓ ప్రత్యేకతను చూపుతారు. చెన్నైలో చదువుకున్న రామ్ చరణ్, రానా కూడా బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ రోజుల నుంచే వారి అనుబంధం మొదలైంది. చెన్నైలో కలిసి చదువుకున్నారు. ఇద్దరు ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకుంటుంటారు. రానా నా బాక్స్ కూడా తినేవాడు అని రామ్ చరణ్, చరణ్ వల్ల నేను కార్పెంటర్ వర్క్ నేర్చుకున్నానని రానా కామెంట్లు చేయడం విశేషం.
సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు మోహన్ బాబు చెన్నైలో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో స్నేహితులయ్యారు. వీరు ఒకే రూమ్ లో ఉంటూ ఎన్నో కష్టాలు పడ్డారు. ఆతరువాత కాలంలో ఇద్దరు ఎన్నో అవకాశాలు అందుకుని స్టార్లుగా మారారు. కాని వీరి స్నేహం అలాగే కొనసాగుతోంది. రజనీకాంత్ మొదటి సినిమా ‘అపూర్వ రాగంగళ్’. ఆ సినిమా తెలుగు రీమేక్ ‘తూర్పు-పడమర’ గా వచ్చింది. తమిళంలో రజనీకాంత్ పాత్రను తెలగులో మోహన్ బాబు నటించారు. రజనీకాంత్ హీరోగా ఎదిగే క్రమంలో ఆయన నటించిన సినిమాల్లో మోహన్ బాబు విలన్‌గా నటించారు. మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు సినిమాలో రజనీ అతిథి పాత్రలో నటించారు. ఇద్దరు స్టార్లు సందర్భాన్ని బట్టి సరదాగా అప్పుడప్పుడు కలుస్తుంటారు.
సినిమాల్లోకి రాకముందు నుంచి ప్రభాస్, గోపీచంద్ ఫ్రెండ్స్. వర్షం సినిమా నుంచి ప్రభాస్, గోపీచంద్‌ల మధ్య స్నేహం ఇంకా బలపడింది. . వీరిద్దరూ కలిసి టూర్లు కూడా వెళ్తుంటారు. ఒకరి సినిమా వేడుకలకు మరొక హాజరవుతారు. వ్యక్తిగతంగా వారు ఒకరికి ఒకరు సహాయం చేస్తుంటారు.
బాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నారా రోహిత్, శ్రీ విష్ణు మంచి స్నేహితులు. శ్రీవిష్ణును ఇండస్ట్రీకి పరిచయం చేసింద నారా రోహిత్. రోహిత్, విష్ణును హీరోగా పెట్టి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాను నిర్మించారు. ఇద్దరూ ఒకరి కెరీర్‌కు మరొకరు అండగా నిలిచారు.
1996 నుండి మొదలైన పూరీ, రవితేజ స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు వీరి స్నేహం బలపడింది. పూరీ వల్ల రవితేజ్ స్టార్ హీరో అయ్యారు. రవితేజ్ సినిమాల వల్ల పూరీ జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ గా మారారు.
స్టూడెంట్ నెంబర్ 1 సినిమా సమయంలో ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య స్నేహం మొదలైంది. ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ పక్కాగా కనిపించేవారు. వారి స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.
ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా చాలా దగ్గరగా ఉంటారు. పార్టీల్లో కలుసుకోవడం, షోలకు గెస్ట్‌లుగా రావడం జరుగుతుంది. ఫోటోలు కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
2008లో వచ్చిన రెడీ సినిమా సమయంలో జెనీలియా, రామ్ మధ్య స్నేహం ప్రారంభమైంది. ఇప్పటికీ వారి స్నేహం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఇంటర్వ్యూలలో జెనీలియా రామ్‌ను తన బెస్ట్ ఫ్రెండ్‌గా చెప్పడం విశేషం.