హౌస్ లో టెన్షన్ పెంచిన నిరాహార దీక్షలు.. బిగ్ బాస్ లో కొత్త డ్రామా షూరు..

Published : Sep 15, 2025, 06:28 PM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 తాజా ప్రోమోలో మాస్క్ మ్యాన్ హరీష్ నిరాహార దీక్ష, మర్యాద మనీష్ కన్నీళ్లు, ప్రియ అహంకారం హౌస్‌లో కొత్త టెన్షన్‌లకు కారణమయ్యాయి. నాగార్జున వార్నింగ్ ఇచ్చినా కూడా మారని కామనర్ల తీరు మార్చుకోలేకపోతున్నారు.

PREV
14
బిగ్‌బాస్ హౌస్‌లో మళ్లీ అగ్గి రాజుకుంది

బిగ్‌బాస్ సీజన్-9లో కామనర్లు, సెలబ్రిటీల మధ్య మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఇప్పటికే శనివారం ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున కెప్టెన్ మాట వినాలని వార్నింగ్ ఇచ్చినా, కామనర్లు తమ స్వభావం మార్చుకోకుండా, వ్యంగంగా మాట్లాడుతున్నారు. కెప్టెన్ పైనే తిరుగుబాటు వైఖరి ప్రదర్శించారు. కెప్టెన్ సంజన ఆదేశాలను అస్సలు పట్టించుకోకుండా మళ్లీ ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో బిగ్ బాస్ లో కొత్త ఉద్రిక్తతలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలో కంటెస్టెంట్లపై కాంట్రవర్సీలు, నిరాహార దీక్షలు, కన్నీటీ పర్యాలతో హౌస్ ఒక్కసారిగా హీటెక్కింది.

24
మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష

బిగ్ బాస్ హౌస్ లో రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం స్టార్ట్ అయ్యింది. ఇందులో గత వారం జరిగిన తప్పులను ఒకరికొకరు ఎత్తు పొడుచుకుంటూ వార్ స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో మాస్క్ మ్యాన్ హరీష్ తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. దమ్ము శ్రీజ, హరిత హరీష్ దగ్గరకు ఫుడ్ తీసుకుని వెళ్లింది. ‘రెండు రోజుల నుంచి ఏం తినడం లేదు.. నీరసం వస్తుంది తినండి’అని చెప్తుంది.

 “ఇంకా ఏం తినను, నీళ్లు కూడా తాగను. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తాను. మీలాంటి వారితో ఉండదల్చుకోలేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం ప్రధానం కారణం ఇతర కంటెస్టెంట్స్ వైఖరి, అలాగే, నాగార్జున కూడా మాస్క్ మ్యాన్ ను మనీష్ ను మందలించిన విషయం తెలిసిందే. తన ఆట తీరు మార్చుకుంటే సరిపోతుంది కానీ, రెండు రోజులుగా ఏం తినకపోవడమేంటీ? అని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

34
మర్యాద మనీష్ కన్నీటి పర్యంతం

మరోవైపు కామనర్లు ప్రియ, దమ్ము శ్రీజ, పవన్‌ , మర్యాద మనీష్ మధ్య చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ప్రియ, శ్రీజలు మనీష్ ను టార్గెట్ చేస్తారు. అతడ్ని తక్కువ చేసి మాట్లాడుతారు. దీంతో మనీష్ తీవ్రంగా అవమానానికి గురయ్యాడు. శ్రీజ “నీకు పనిలేదు కాబట్టి ఇతరుల పనిలో జోక్యం చేసుకుంటావు” అంటూ ఫైర్ అవ్వగా, మనీష్ ప్రతిస్పందించాడు. దీనికి మరింత ఆగ్రహంతో శ్రీజ “నీ పని ఎప్పుడూ అరవడమే, తర్వాత కార్నర్‌కి వెళ్లి ఏడవడమే” అంటూ ఎగతాళి చేసింది. ఈ మాటలు తట్టుకోలేక మనీష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సమయంలో ఇమ్మూ వెళ్లి ఓదార్చుతారు. ఈ సమయంలో మనీష్ మాట్లాడుతూ ‘కామనర్స్ అన్నదే ఒక గలీజ్ మార్క్.. ఫస్ట్ కామనర్స్ కాదు వరస్ట్ కామనర్స్’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు.

44
ప్రియ – సంజన మధ్య వాగ్వాదం

కెప్టెన్‌గా సంజన ఇచ్చిన సూచనలను ప్రియ పట్టించుకోకుండా ఎగతాళి చేసింది. “దొంగతనం జరిగితే జరగనీ, ఫుడ్ మీరు తెస్తారు కదా” అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తుంది. దీనితో సంజన అసహనం వ్యక్తం చేసింది. హౌస్‌లో జరిగే టాస్క్‌లను సీరియస్‌గా తీసుకోని ప్రియ వైఖరి ఇతర కంటెస్టెంట్స్‌లో కూడా అసంతృప్తిని రేపింది. ఇక కామనర్లు ప్రవర్తిస్తున్న తీరు చూసి ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. ఇతర కంటెస్టెంట్లతో అహంకారంగా, అవినీతిగా ప్రవర్తించడం వల్ల సోషల్ మీడియాలో వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “కామనర్స్‌ వల్లే హౌస్ వాతావరణం చెడిపోతోంది” అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories