మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గురించి ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. అర్థరాత్రి హీరోయిన్ల గాసిప్పులు అడిగేవాడట. తాజాగా ఇళయరాజా 50 సంవత్సరాల వేడుకలో సూపర్ స్టార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక లెజెండరీ నటుడు. కోలీవుడ్‌కే కాదు, ఇండియన్ సినిమా గర్వంచదగ్గ స్టార్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో ఇళయరాజా కూడా సంగీత ప్రపంచంలో ఒక లెజెండ్. వీరిద్దరు తమ కెరీర్‌లను చూస్తూ ఎదుగుతూ వచ్చారు. సౌత్ సినిమానే శాసించారు. ఇదిలా ఉంటే తాజాగా ఇళయరాజా చిత్ర పరిశ్రమలోకి వచ్చి 50ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో లేటెస్ట్ గా ఒక భారీ ఈవెంట్‌ని నిర్వహించారు. దీనికి తమిళనాడు సీఎం స్టాలిన్‌తోపాటు సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, ఇతర సినీ ప్రముఖులు గెస్ట్ లుగా హాజరయ్యారు.
ఇందులో ఇళయరాజా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రజనీకాంత్. మ్యూజిక్ మ్యాస్ట్రో రొమాంటిక్ విషయాలను కూడా వెల్లడించారు. అందులో భాగంగా తాను నటించిన `జానీ` సినిమా షూటింగ్ టైమ్‌లో చోటు చేసుకున్న సంఘటన గురించి పంచుకున్నారు. ఇళయరాజా స్పీచ్ మధ్యలో జోక్యం చేసుకుని అసలు విషయాన్ని బయటపెట్టారు. `జానీ` మూవీకి మహేంద్రన్ దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అయితే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నప్పుడు రజనీకాంత్‌తోపాటు దర్శకుడు మహేంద్రన్, ఇళయరాజా ఉన్నారట. ఆ సమయంలో వీరంతా ఆల్కహాల్ తీసుకున్నారు. ఇళయరాజా హాఫ్ బీర్ తాగాడట. ఆ తర్వాత ఆయన రెచ్చిపోయాడట. హాఫ్ బీర్ కే ఆయనలోని రొమాంటిక్ యాంగిల్ బయటకు వచ్చిందట.
35
ఇళయరాజా హీరోయిన్ల గాసిప్పులు అడిగేవాడట
సరదాగా జోకులు వేసుకుంటూ తెల్లవారుజామున మూడు గంటలకు వరకు నవ్వుతూనే ఉండేవారమని తెలిపారు. అంతేకాదు ఆ సమయంలో ఇళయరాజాలోని రొమాంటిక్ బాయ్ బయటకు వచ్చేవాడని, ఇండస్ట్రీలోని గాసిప్పులన్నీ అడిగేవాడట. ముఖ్యంగా హీరోయిన్ల గాసిప్పుల విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడని తెలిపారు రజనీకాంత్. అలా ఆ రొమాంటిక్ ఫీల్ లోనే రొమాంటిక్ సాంగ్స్ కి ట్యూన్స్ చేసేవాడని, చాలా పాటలు అంత రొమాంటిక్‌గా రావడానికి కారణం ఇదే అని తెలిపారు. ఇళయరాజా స్పీచ్ మధ్యలో వచ్చి రజనీ ఈ విషయాన్ని తెలిపడం విశేషం. దీంతో ఆ ఈవెంట్ మొత్తం నవ్వులతో హోరెత్తిపోయింది.
అయితే పక్కనే ఉన్న ఇళయరాజా ఇవన్నీ నిజం కాదని, సరదాగా చెబుతున్న విషయాలన్నట్టుగా చేయి ఊపడం విశేషం. సరదాగా రజనీకాంత్ చెప్పిన ఈ మాటలు వైరల్‌గా మారాయి. రజనీకాంత్ నటించిన ఎన్నో సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు. సూపర్ హిట్ కాంబినేషన్‌గానూ నిలిచారు. వీరి మధ్య సినిమాలకు మించిన అనుబంధం ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
55
`కూలీ`తో సందడి చేసిన రజనీకాంత్, `జైలర్ 2`తో బిజీ
ఇక రజనీకాంత్ ఇటీవల `కూలీ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సుమారు రూ. 500కోట్లు వసూలు చేసింది. కానీ ఫైనల్‌గా పరాజయం చెందింది. ఇక ప్రస్తుతం ఆయన `జైలర్ 2`లో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలకపాత్రల్లో గెస్ట్ రోల్స్ చేయబోతున్నారు. అలాగే బాలయ్య కూడా కనిపిస్తారని సమాచారం.