డివోర్స్ తర్వాత సమంతకి కావాలనే ఛాన్సులు ఇవ్వడం లేదా ? మంటలు రేపుతున్న మంచు లక్ష్మి పరోక్ష వ్యాఖ్యలు

Published : Sep 18, 2025, 03:02 PM IST

మంచు లక్ష్మి నటించిన దక్ష మూవీ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మి పరోక్షంగా సమంత గురించే మాట్లాడింది అని నెటిజన్లు భావిస్తున్నారు. 

PREV
15
మంచు లక్ష్మి దక్ష మూవీ 

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి టాలీవుడ్ లో అప్పుడప్పుడూ అవకాశాలు అందుకుంటున్నారు. మంచు లక్ష్మి వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆఫర్స్ మాత్రం ఆమె కోరుకున్న విధంగా రావడం లేదు. మంచు లక్ష్మి తాజాగా నటించిన చిత్రం దక్ష. ఈ మూవీలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. మిస్టరీ కేసుని ఛేదించే పోలీస్ అధికారిపాత్రలో కనిపిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 19 శుక్రవారం రోజు రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 

25
ఇదే ప్రశ్న మహేష్ బాబుని అడగగలరా ?

 ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటర్వ్యూలో మహిళల డ్రెస్సింగ్ సెన్స్ గురించి చర్చ జరిగింది. 50 ఏళ్ళ వయసుకి దగ్గర పడుతున్న మీరు ఇలాంటి డ్రెస్సులో వేసుకోవడం ఏంటి అనే విమర్శలు వస్తున్నాయి అని యాంకర్ మంచు లక్ష్మిని ప్రశ్నించగా.. ఆమె ఇదే ప్రశ్న మహేష్ బాబుని అడగగగలరా మీరు అని కౌంటర్ ఇచ్చింది. మహేష్ బాబుకి కూడా 50 ఏళ్ళు వచ్చాయి. ఏవయ్య మహేష్ బాబు మీరు ఎందుకు షర్ట్ విప్పుకుని తిరుగుతున్నారు అని మీరు ప్రశ్నించగలరా అంటూ మంచు లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. 

35
విడాకులు తీసుకున్న హీరోయిన్, కావాలనే ఛాన్సులు ఇవ్వడం లేదు 

మగాళ్ళకి లేని రిస్ట్రిక్షన్స్ ఆడవాళ్ళకి మాత్రమే ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదు. పెళ్ళైన మహిళ సినిమాల్లో నటించాలంటే అంత సులభం కాదు. అత్తమామల బాధ్యత, పిల్లల బాధ్యత అన్నీ ఆడవాళ్లకే ఉంటాయి. అవన్నీ పూర్తి చేసి టైం ఉంటేనే నటించాలి. కానీ మగాడికి ఆ బాధ్యతలు ఉండవు. దీనికి తోడు డివోర్స్ అయిన మహిళ నటించాలన్నా కష్టమే. ఒక సూపర్ స్టార్ వైఫ్ టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించింది. ఆమె విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఆమె నటించాలని ప్రయత్నిస్తుంటే.. వద్దమ్మా వాళ్ళతో మాకు సమస్య వస్తుంది అని అవకాశాలు ఇవ్వడం లేదు అని మంచు లక్ష్మి కామెంట్స్ చేశారు. 

45
శుభం చిత్రంలో మెరిసిన సమంత 

దీనితో యాంకర్ స్పందిస్తూ.. మీరు చెప్పేది సమంత గురించే కదా అని అడిగారు. దీనితో మంచు లక్ష్మి సమాధానం ఇస్తూ విడాకులు తీసుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు కదా అని అన్నారు. మంచు లక్ష్మి పరోక్షంగా చెప్పింది ఎవరి గురించి అయినప్పటికీ.. సమంతకి మాత్రం విడాకుల తర్వాత అవకాశాలు తగ్గిన మాట వాస్తవమే. చివరగా ఆమె తాను నిర్మించిన శుభం చిత్రంలో ఒక పాత్రలో నటించారు. 

55
పుష్ప లో అనసూయ పాత్ర చాలా ఇష్టం 

అదే విధంగా మంచు లక్ష్మి పుష్ప మూవీలో అనసూయ పాత్ర గురించి కూడా మాట్లాడారు. దాక్షాయణి పాత్ర నాకు వచ్చి ఉంటే ఎలా నటించేదాన్నో నాకు తెలియదు. అనసూయ మాత్రం అద్భుతంగా చేసింది. ఆమె పాత్రలో రా నెస్ బాగా కనిపించింది అని మంచు లక్ష్మి ప్రశంసలు కురిపించింది. 

Read more Photos on
click me!

Recommended Stories