బిగ్ షాక్.. బెట్టింగ్ యాప్ కేసులో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య.. ముగ్గురూ ఇరుక్కుపోయారు
బెట్టింగ్ యాప్స్ వివాదం సంచలన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఒక మోస్తరు క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలపైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏకంగా బడా హీరోలపై కేసులు నమోదయ్యాయి.
బెట్టింగ్ యాప్స్ వివాదం సంచలన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఒక మోస్తరు క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలపైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏకంగా బడా హీరోలపై కేసులు నమోదయ్యాయి.
టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ వివాదం బాగా ముదురుతోంది. బెట్టింగ్ యాప్స్ మాయలో పడి అమాయకులు వారి సంపాదన కోల్పోతున్నారు. లక్షల్లో డబ్బు నష్టపోతున్నారు. ఆ తర్వాత మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఇప్పటికే బుల్లితెర సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ల పై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ కూడా ప్రారంభించారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, సుప్రీతా లాంటి వారిపై కేసులు నమోదయ్యాయి. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ లాంటి సెలెబ్రిటీలు కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు.
పేరున్న సెలెబ్రిటీలు ప్రమోట్ చేయడం అమాయకులు బెట్టింగ్ యాప్స్ కి ఆకర్షితులు అవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదం సంచలన మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఒక మోస్తరు క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలపైనే కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏకంగా బడా హీరోలపై కేసులు నమోదయ్యాయి. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా బెట్టింగ్ యాప్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రభాస్, గోపీచంద్, నందమూరి బాలకృష్ణపై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదైంది.
వీరు ముగ్గురూ చైనాకి చెందిన Fun88 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్ షోలో వీరు ముగ్గురూ ఈ యాప్ ని ప్రోమోట్ చేశారని రామారావు ఇమ్మినేని అనే లాయర్ కేసు నమోదు చేశారు. ఇది ఇప్పుడు ఎంత దూరం వెళుతుందో అనే ఆందోనళ ఫ్యాన్స్ లో నెలకొంది. రామారావు అనే లాయర్ వీరి ముగ్గురిపై కేసు నమోదు చేయడం మాత్రమే కాదు ఆ యాప్ ని బ్యాన్ చేయాలని కూడా కోరారు. మరి ఈ కేసుపై పోలీసులు ఎలా ముందుకు వెళతారు అనేది ఆసక్తిగా మారింది.