పుష్ప 2 భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా కోసం ఒప్పందం చేసుకున్నాడు.
అల్లు అర్జున్ రూ. 175 కోట్లకు, రాబడిలో 15 శాతం వాటాకు అంగీకరించాడని సమాచారం. పింక్‌విల్లా ప్రకారం, అల్లు అర్జున్ సన్ పిక్చర్స్ తో రూ. 175 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇండియాలోనే ఇది రికార్డ్ రెమ్యునరేషన్. ప్రభాస్, రజినీ, షారుఖ్ లాంటి బడా హీరోలని అధికమించి అల్లు అర్జున్ ఈ రికార్డు సాధించారు. ఈ డబ్బుతో ఏకంగా పాన్ ఇండియా సినిమానే తీసేయొచ్చు.
స్క్రీన్ ప్లేలో అట్లీ సినిమాలోని అన్ని అంశాలు ఉంటాయి. అల్లు అర్జున్ కు ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా అని ఒక వ్యక్తి చెప్పాడు.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించాడు. సందీప్ రెడ్డి వంగా, వేణు శ్రీరామ్, కొరటాల శివతో కలిసి సినిమాలు చేయనున్నాడు.
అల్లు అర్జున్, అట్లీతో కలిసి సినిమా చేస్తున్నాడని చాలా మంది అంటున్నారు. దీని గురించి నటుడు, దర్శకుడు ఇంకా చెప్పలేదు.