Tmanannaah, Pooja Hegde, Samantha
ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కామన్ అయిపోయాయి. ఐటమ్స్ సాంగ్ వల్లే సినిమాపై బజ్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. అంతలా ఐటెం సాంగ్స్ ప్రభావం చూపుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 చిత్రంలో కిస్సిక్ ఐటెం సాంగ్స్ యువతని విపరీతంగా ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో ఐటెం సాంగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమన్నా, కాజల్ అగర్వాల్, శ్రీలీల, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఐటెం సాంగ్స్ లో నటించారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు వీళ్లంతా ఐటెం సాంగ్స్ చేశారు. ఒకరకంగా కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే. సాంగ్ కనుక ఫ్లాప్ అయితే వాళ్ళ క్రేజ్ పడిపోయో అవకాశం ఉంది. స్టార్ హీరోయిన్లు మీ ఐటెం సాంగ్స్ చేస్తున్నప్పుడు మీపై ఎలాంటి ఒత్తిడి ఉండేది అని యాంకర్ దేవిశ్రీ ని ప్రశ్నించారు.
దీనికి దేవిశ్రీ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. సమంత కానీ, తమన్నా కానీ, పూజా హెగ్డే కానీ వీళ్లంతా సాంగ్ విన్న తర్వాతే చేయడానికి అంగీకరించారు. సమంతకి ముందు సాంగ్ వినిపించలేదు. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ ఉంటుంది అని చెప్పాం. చాలా రోజులు పాటు చేయాలా వద్దా అని తెగ ఆలోచించింది. ఒక్కసారి సాంగ్ విన్న తర్వాత సమంత వెంటనే ఓకె చెప్పింది దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. సమంత చేసిన ఊ అంటావా మావ సాంగ్ దేశం మొత్తం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సమంతకి ఇదే ఫస్ట్ ఐటెం సాంగ్.
Pooja Hegde
సమంత మాత్రమే కాదు.. కాజల్ అగర్వాల్, శ్రీలీల, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లు తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఐటెం సాంగ్స్ చేశారు. కాజల్ జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ సాంగ్ చేశారు. పూజా హెగ్డే రంగస్థలం చిత్రంలో జిగేలు రాణి సాంగ్ చేసింది. తమన్నా కూడా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు జై లవకుశ చిత్రంలో స్వింగ్ జరా సాంగ్ చేసింది.