ఎన్బీకే థమన్‌కి బాలయ్య బిగ్‌ షాక్‌, ఆ సినిమా నుంచి ఔట్‌?

Published : Jan 25, 2025, 05:19 PM IST

బాలకృష్ణ, థమన్‌ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్టే. అంతేకాదు ఎన్బీకే థమన్‌గా కూడా మారిపోయారు. అయితే థమన్‌కి షాక్‌ తగలబోతుంది.   

PREV
14
ఎన్బీకే థమన్‌కి బాలయ్య బిగ్‌ షాక్‌, ఆ సినిమా నుంచి ఔట్‌?

బాలకృష్ణ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్‌ పర్‌ఫెక్ట్ గా సెట్‌ అవుతున్నారు. బాలయ్యకి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వడంలో, ఆర్‌ఆర్‌ని అందించడంలో బెస్ట్ అనిపించుకున్నారు. బాలయ్య లాంటి మాస్‌ హీరోకి, అంతకు మించిన మాస్‌ అనిపించేలా బీజీఎం అందిస్తూ థియేటర్లలో బాక్సులు పగిలిపోయేలా చేస్తున్నారు. దీంతో బాలయ్యని, థమన్‌ని వేరుగా చూడలేని పరిస్థితి. గత కొన్ని రోజులుగా వరుసగా ఈ ఇద్దరి కాంబో బ్లాక్‌ బస్టర్‌ అనిపించుకుంటుంది. 
 

24

మొన్న వచ్చిన `డాకు మహారాజ్‌` మూవీ విషయంలో కూడా ఇదే నిరూపితమైంది. ఈ మూవీ సక్సెస్‌లోనూ బీజీఎం, పాటలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు చేయబోతున్న `అఖండ 2`కి కూడా థమన్‌ సంగీతం అందిస్తున్నారు. గత చిత్రాలను మించి ఈ మూవీ ఉండబోతుందని ఇటీవలే థమన్‌ వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పుడు థమన్‌కి పెద్ద షాక్‌ తగిలింది. బాలయ్య సినిమా నుంచి ఆయన్ని పక్కన పెడుతున్నారట. మరి అది ఏ సినిమా, ఆ కథేంటో చూస్తే. 
 

34
Thaman

బాలకృష్ణ ఇప్పుడు `అఖండ 2`లో నటిస్తున్నారు. అనంతరం తనకు `వీరసింహారెడ్డి` వంటి బ్లాక్‌ బస్టర్‌ని అందించిన గోపీచంద్‌ మలినేనితో సినిమా చేయబోతున్నారు. నెక్ట్స్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుంది. ఈ మూవీకి సంగీతం థమన్‌ అందించడం లేదట. ఆయన స్థానంలో మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ని దించుతున్నారట. కోలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ ని దించుతున్నాడట. 

44

కోలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచారు అనిరుథ్‌ రవిచందర్‌. మాస్‌ బీజీఎం అందించడంలో దిట్ట అనిపించుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య మూవీకి ఆయన్ని దించుతున్నారట గోపీచంద్‌ మలినేని. ఈ క్రమంలో థమన్‌కి బ్రేక్‌ ఇస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీ జూన్‌ 10న ప్రారంభం కాబోతుందట. 

read  more: పవన్‌ కళ్యాణ్‌, వేణు మాధవ్‌ మధ్య రహస్య ఒప్పందం.. డిప్యూటీ సీఎం చాలా మిస్‌ అవుతున్నట్టే?

also read: `గేమ్‌ ఛేంజర్‌` ఫెయిల్యూర్‌పై ఆర్జీవీ జెన్యూన్‌ రివ్యూ.. శంకర్ ఇంత చిన్న లాజిక్‌ ఎలా మిస్ అయ్యాడు?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories