
టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా నాలుగు సినిమాల విజయాలతో ఆయన దూసుకుపోతున్నాడు. అదే సమయంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లోనూ తన విజయపరంపర కొనసాగిస్తున్నారు. మరోవైపు `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోతోనూ ఇండియా వైడ్‌గా సక్సెస్ అయ్యారు. ఇలా ఇప్పుడు బాలయ్య పట్టిందల్లా బంగారంలా మారింది.
దీనికితోడు మరో కీర్తి కిరీటం ఆయన ఖాతాలో చేరింది. ఇప్పటికే పద్మ శ్రీ పురస్కారం అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారానికి ఎంపికయ్యారు. పద్మభూషణ్ అవార్డుని ఆయనకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగులో సినిమా రంగంలో ఆయనకు ఒక్కరికే ఈసారి పద్మ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో విషెస్ పోస్ట్ లతో బాలయ్య యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వెళ్లింది.
అయితే కొందరు పడని వారు బాలయ్యపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకుని రచ్చచేస్తున్నారు. బాలకృష్ణ ఓల్డ్ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇందులో భారత అత్యున్నత పురస్కారం భారతరత్నపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఉండటం విశేషం.
భారతరత్న ఎన్టీ రామారావుకి ఇవ్వకపోవడంపై ఆయన గతంలో కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో బాలయ్య.. భారతరత్న పురస్కారాన్ని కాలు గోటితో అభివర్ణించారు.
ఇంతటి అత్యున్నత పురస్కారాన్ని ఆయన ఇలా తక్కువ చేసి మాట్లాడటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. అయితే ఇప్పుడు ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన వేళ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.
ఈ వీడియోలో.. బాలయ్య టీవీ9 ఇంటర్వ్యూలో మాట్లాడారు.. `సినిమాల్లో ఒక మ్యూజిక్ డైరెక్ట్‌కి ఒక స్టయిల్ ఉంటుంది. రెహ్మాన్, ఎవరో రెహ్మాన్ నాకు తెలియదు. నేను పట్టించుకోను. ఎప్పుడో పదేళ్లకి హిట్ ఇస్తాడు, ఆస్కార్ అంటాడు, అవన్నీ పట్టించుకోను. అందుకే రామారావుకి భారతరత్న అంటే అవన్నీ ఆయన చెప్పుతో సమానం, ఆయన కాలి గోటితో సమానం. ఇచ్చిన వాళ్లకి గౌరవం గానీ, ఆయనకు గౌరవం ఏంటి? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదే టీవీలో మరో సందర్భంలో తన వ్యాఖ్యలపై స్పందించారు బాలయ్య. `అందుకే విసుగొచ్చి ఆయన కాలు గోటితో సమానం భారతరత్న, పదవులకు ఆయన అలంకారం ఏమోగానీ, ఆయనకు పదవులు అలంకారం కాదు, అది ఇచ్చిన వాళ్ల సంస్కారం, వాళ్లకి గౌరవం. వాళ్లకి పేరు వస్తుంది. రామారావుకి పేరు వచ్చేదేముంది. ఆయన మహానుభావుడు, మహానుభావుల కోవకు చెందిన వ్యక్తి రామారావు` అని అన్నారు బాలయ్య.
ఈ వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ బాలయ్యని ట్రోల్ చేస్తున్నారు. భారతరత్నని ఇలా తిట్టిన వ్యక్తికి ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం ఎలా ఇస్తారని అంటున్నారు. అదే సమయంలో బాలయ్య వివాదాలను తెరపైకి తీసుకొస్తూ నా నా రచ్చ చేస్తున్నారు.
బాలయ్యకి ప్రతిష్టాత్మక పురస్కారం రావడాన్ని జీర్ణించుకోలేక ఆయనపై ఇలా నెగటివ్ ప్రచారం చేస్తున్నారని ఎన్బీకే ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. కుళ్లు కొని చావండి అంటూ కౌంటర్లతో రెచ్చిపోతున్నారు నందమూరి ఫ్యాన్స్.
read more: బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు, పద్మభూషణ్ పురస్కారంపై స్పందించని నాగ్?