కుంభమేళ వేళ హనీమూన్‌ ఫోటోలు పంచుకున్న సోనాక్షి సిన్హా.. ట్రోలర్స్ నానా రచ్చ

Published : Jan 26, 2025, 08:37 PM IST

మహా కుంభమేళ సమయంలో హీరోయిన్‌ సోనాక్షి సిన్హా తన హనీమూన్ ఫోటోలను షేర్ చేయడం వివాదాస్పదమైంది. ట్రోలర్స్ ఆమెని దారుణంగా ఆడుకుంటున్నారు. 

PREV
17
కుంభమేళ వేళ హనీమూన్‌ ఫోటోలు పంచుకున్న సోనాక్షి సిన్హా.. ట్రోలర్స్ నానా రచ్చ
సోనాక్షి సిన్హా హనీమూన్ ఫోటో

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళ జరుగుతోంది. దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళకు, సోనాక్షికి సంబంధం ఏమిటి? నెటిజన్లు ఆమెను ఎందుకు విమర్శిస్తున్నారు?  అనేది చూస్తే. 

27
సోనాక్షి, జహీర్ హనీమూన్

సోనాక్షి, జహీర్ తమ హనీమూన్‌ను ఆస్వాదిస్తున్నారు. వీరిద్దరు గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడెనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు గతేడాది మ్యారేజ్‌ చేసుకుని ఒక్కటయ్యారు.  

37
సోనాక్షి ట్రోల్

గతేడాది జూన్‌ 23న వీరిద్దరి పెళ్లి కాగా, అనంతరం హనీమూన్‌ వెళ్లారు. వెకేషన్‌ని బాగా ఎంజాయ్‌ చేశారు. అయితే అప్పటి హనీమూన్‌ ఫోటోలను ఇప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంది సోనాక్షి సిన్హా.  దీంతో ఇది చూసిన ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ఆమెని ట్రోల్‌ చేస్తున్నారు. 

47
వైరల్ ఫోటోలు

సోనాక్షి, జహీర్ హనీమూన్ ఫోటోల్లో చాలా సరదాగా, ఎంజాయ్‌ చేస్తున్నారు. సిడ్నీలో పిక్స్ కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని ఫోటోల్లో మంచి రొమాంటిక్‌ మూడ్‌లోనూ ఉన్నారు. ఇదే ఇప్పుడు సోనాక్షి ట్రోలింగ్‌కి కారణమయ్యింది. 

57
సిడ్నీ సెల్ఫీ

అయితే ప్రస్తుతం దేశమంతా భక్తితో మునిగిపోయారు. పవిత్ర రోజులు గడుపుతున్నారు. కుంభమేళలో పాల్గొంటూ దేవుడిని పూజిస్తున్నారు. పవిత్రమైన పుణ్యస్నానాలు చేస్తూ తమ పాపాలను తొలగించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సోనాక్షి ఇలా రొమాంటిక్‌ పిక్స్ పంచుకోవడం పట్ల ట్రోలర్స్ రచ్చ చేస్తున్నారు. 

67
విమర్శలు

నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోనాక్షి ఇలాంటి టైమ్‌లో ఇదేం పనులు అంటున్నారు. పైగా పాత ఫోటోలను ఇప్పుడు పంచుకోవడాన్ని తప్పుపడుతున్నారు. ధార్మిక భావాలను దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది సోనాక్షి సిన్హా. 

77
డేటింగ్

సోనాక్షి, జహీర్ 7 సంవత్సరాలు డేటింగ్ చేశారు. వీరిద్దరు `డబుల్‌ ఎక్స్ ఎల్‌` అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో గతేడాది పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి సిన్హా.. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శతృజ్ఞ సిన్హా కూతురు అనే విసయం తెలిసిందే. ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలు చేసిన సోనాక్షి సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తూ రజనీకాంత్‌తో `లింగా` చిత్రంలో నటించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories