Published : Mar 14, 2025, 02:58 PM ISTUpdated : Mar 14, 2025, 03:00 PM IST
నందమూరి వారసత్వం తీసుకుని చాలా మంది హీరోలు టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. కాని స్టార్ హీరోల వారసత్వంలో హీరోయిన్లు మాత్రం లేదు. ఆ అవకాశం బాలకృష్ణ పెద్ద కూతురు బ్రహ్మణీకి వచ్చిందని సమాచారం. ఓ స్టార్ డైరెక్టర్ హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వగా.. బాలయ్య ఏం చేశారో తెలుసా?
టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసత్వంతో చాలామంది హీరోలు స్టార్లుగా కొనసాగుతున్నారు. పాన్ ఇండియాను దున్నేస్తున్నారు. కాని స్టార్ హీరోల వారుసులుగా హీరోయిన్లు మాత్రం బయటకు రావడంలేదు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేష్, రాజశేఖర్ లాంటి స్టార్స్ కు కూతుర్లు ఉన్నారు. ఇందులో మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది. నిర్మాతగా కూడా మూవీస్ చేసింది.
ఇక చిరంజీవి పెద్ద కూతురు కూడా నిర్మాతగా మారింది. అటు బాలయ్య చిన్న కూతురు కూడా నిర్మాతగా మారి మోక్షజ్ఞను లాంచ్ చేసే ప్రయత్నం చేస్తోంది. కాని వెంటకేష్ ఫ్యామిలీ నుంచి ఎవరు సినిమాల వైపు చూడటంలేదు. అందులో ఇద్దరు కూతుర్లకు పెళ్లి కూడా చేశాడు. ఇక జీవిత రాజశేఖర్ కూతుర్లు ఇద్దరు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా వీరు హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
ఇలా ఇండస్ట్రీ నుంచి వారుసులుగా హీరోయిన్లు రావడం చాలా తక్కువే. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్లను మించి అందంగా ఉంటారు బాలయ్య ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు బ్రాహ్మణి నారా లోకేష్ తో పెళ్ళి తరువాత వారి వ్యాపారాలు చూసుకుంటుంది. చిన్న కూతురు తేజస్వీ గీతం ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళింది. ఇద్దరు హీరోయన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉన్నా.. బాలయ్య మాత్రం వారిని ఇటు వైపు చూడకుండా జాగ్రత్త పడ్డారు.
గతంలో బ్రాహ్మణి హీరోయిన్ గా చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయట. స్టార్ డైరెక్టర్లు ఆమెను హీరోయిన్ గా లాంచ్ చేయడానికి ప్రయత్నం చేశారని తెలుస్తోంది. కాని బాలయ్య మాత్రం వారిని ఇండస్ట్రీలోకి రాకుండా జాగ్రత్తపడ్డారట. స్టార్ డైరెక్టర్ మణిరత్నం బ్రాహ్మణీని హీరోయిన్ గా పెట్టి మంచి సినిమా చేయాలని చూశారట.
55
మణిరత్నం హీరోయిన్లు అందరు ఏ రేంజ్ లో ఉన్నారో అందరికి తెలుసు. బ్రహ్మిణి కూడా ఏ రేంజ్ కు వెళ్ళేదో ఊహించుకోవచ్చు. కాని బాలయ్యకు కాని, బ్రాహ్మిణికి హీరోయన్ గా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేనట్టు తెలుస్తోంది. అందుకే మణిరత్నం ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేశారట. ఇలా ఒక సారి కాదు బ్రాహ్మిణికి ఎన్నో అవకాశాలు వచ్చాయట.