చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇచ్చిన మీన, చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, సత్యరాజ్, ప్రభు, కార్తీక్, అజిత్ లాంటి చాలా మంది మాస్ హీరోలతో కలిసి నటించింది. దాదాపు 45 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న మీనా ఇప్పటికీ మంచి మంచి పాత్రలో నటిస్తూనే ఉంది.
ఎన్నో సినిమాల్లో నటించిన మీనా ఎలాంటి అశ్లీలత లేకుండా, హోమ్లీ లుక్ లో అదరగొట్టింది. తెలుగుతో పాటు మలయాళం, కన్నడ తమిళ, భాషల్లో కూడా నటించింది. ఈ నేపథ్యంలో 'మూకుత్తి అమ్మన్ 2' కార్యక్రమంలో మీనాని కనీసం హాయ్ అని కూడా విష్ చేయలేదట నయనతార.