వివాదంగా మారిన బాలకృష్ణ కామెంట్స్.. ఈ స్టార్‌ హీరోల అభిమానులు ట్రోలింగ్‌

Published : Nov 24, 2025, 09:28 AM IST

స్టార్‌ హీరోలపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి. దీంతో ఆయా స్టార్‌ హీరోల అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. త్వరలో సినిమా విడుదల నేపథ్యంలో ఈ వివాదం చర్చనీయాంశం అవుతోంది. 

PREV
15
సనాతన ధర్మాన్ని ప్రమోట్‌ చేసేలా `అఖండ 2

నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ 2 తాండవం` సినిమా మరో రెండు వారాల్లో విడుదల కాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ`కి సీక్వెల్‌. ఆ మూవీ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఈ సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ ఆకట్టుకుంది. ఇందులో శివతత్వాన్ని ప్రధానంగా చూపించారు. అదే సమయంలో ఈ సినిమా ద్వారా ఎక్కువగా సనాతన హైందవ ధర్మాన్ని ప్రమోట్‌ చేస్తున్నట్టు ట్రైలర్‌లో అర్థమవుతుంది. హిందుత్వాన్ని ప్రమోట్‌ చేసే మూవీగా దీన్ని రూపొందించినట్టుగా ఉంది. ఇదే ఇక్కడ పెద్ద చిక్కు. సినిమాని సినిమాగా తీస్తే ఆడియెన్స్ ఆదరిస్తారు. మతాలకు ముడిపెట్టి తీస్తే అంతగా రిసీవ్‌ చేసుకోరు. సినిమా వేరు, మతం వేరు అనే కోణంలో ఆడియెన్స్ చూస్తారు.

25
పవన్‌ కి చేదు అనుభవం, మరీ `అఖండ 2`

ఆ మధ్య పవన్‌ కళ్యాణ్‌ నటించిన `హరి హర వీరమల్లు` మూవీ విషయంలో ఇదే జరిగింది. ధర్మం, హిందుత్వం, సనాతన ధర్మం అనే అంశాలను బాగా ప్రమోట్‌ చేశారు పవన్‌. కానీ సినిమా రిజల్ట్ భారీగా దెబ్బకొట్టింది. అది డిజాస్టర్‌గా నిలిచింది. మరి ఇప్పుడు `అఖండ 2`ని కూడా ఆ సెంటిమెంట్‌ దెబ్బకొట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికితోడు అటు బాలయ్య, ఇటు బోయపాటి కూడా ఇదే విషయాలను చెబుతున్నారు. ప్రతి ఈవెంట్లలోనూ ఇవే విషయాలు మాట్లాడుతున్నారు. ఇదే ఇప్పుడు `అఖండ 2` ఫలితంపై అనుమానాలకు తావిస్తుంది. కానీ బాలయ్య మార్క్‌ యాక్షన్‌, భారీ డైలాగ్‌లు, సెంటిమెంట్‌, ఎమోషన్స్ ఉండటంతో అవి ఆకట్టుకుంటాయి. పైగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు. అభిమానులు కూడా అదే ధైర్యంతో ఉన్నారు.

35
నేను ఒరిజినల్‌ వాళ్లు గ్రీన్‌ మ్యాట్‌ హీరోలు

ఇదిలా ఉంటే బాలకృష్ణ కామెంట్స్ ఇప్పుడు వివాదంగా మారుతున్నాయి. బాలకృష్ణ బెంగుళూరులో `అఖండ 2` ట్రైలర్‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. దీనికి శివరాజ్‌ కుమార్‌ గెస్ట్ గా హాజరయ్యారు. అభిమానుల్లో ఇద్దరూ జోష్‌ని నింపారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, పలువురు హీరోలపై సెటైర్లు వేశారు. తాను ఒరిజినల్‌ యాక్టర్‌ని అని, వాళ్లు డూబ్లికేట్‌ అన్నారు. తాను బ్లూ మ్యాట్‌, గ్రీన్‌ మ్యాట్‌లో షూటింగ్‌ చేసే నటుడిని కాదన్నారు. `కొంత మంది హీరోలు సెట్లకి రాకుండానే గ్రీన్‌ మ్యాట్‌, బ్లూ మ్యాట్‌లలో షూటింగ్‌ పూర్తి చేస్తున్నారు, కానీ నేను మాత్రం ఒరిజినల్‌గా నిజమైన శ్రమతో పనిచేస్తున్నాను` అని బాలకృష్ణ కామెంట్ చేశారు.

45
బాలయ్యపై ఈ హీరోల అభిమానులు ట్రోలింగ్‌

రెండు రోజుల క్రితం బాలయ్య చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి. బాలయ్య ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎక్కువగా ప్రభాస్‌, పవన్‌ కళ్యాణ్‌ వంటి హీరోలు గ్రీన్‌ మ్యాట్‌, బ్లూ మ్యాట్‌లలో సినిమాలు చేస్తున్నారు. వాళ్లు చేయాల్సిన మూవీస్‌ అలా ఉంటున్నాయి. అంతేకాదు ఇప్పుడు అల్లు అర్జున్‌ చేయబోతున్న అట్లీ మూవీ కూడా దాదాపు 70శాతం గ్రీన్‌ మ్యాట్‌లోనే ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఆయా హీరోల అభిమానులు బాలయ్య కామెంట్స్ కి హర్ట్ అవుతున్నారు. ఆయన్ని ట్రోల్‌ చేస్తున్నారు. బాలయ్యని తక్కువ చేసి కామెంట్లు పెడుతున్నారు. ఆయన కేవలం రీల్‌ హీరో అని, ఆయన సినిమాలు లాజిక్‌ లెస్‌గా ఉంటాయని అంటున్నారు. ఇంకా దారుణంగా కామెంట్లతో ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య అభిమానులు రియాక్ట్ అవుతూ, ఆయన ఎవరినీ ఉద్దేశించి అనలేదని, తాను కష్టపడే విధానం మాత్రమే చెప్పారని సమర్థిస్తున్నారు. మొత్తంగా ఇది రచ్చ రచ్చగా మారింది.

55
బాలయ్య తొలి పాన్‌ ఇండియా మూవీ `అఖండ 2`

బాలయ్య హీరోగా రూపొందిన `అఖండ 2 తాండవ`లో సంయుక్త హీరోయిన్‌గా నటించింది. ఆదిపినిశెట్టి విలన్‌గా చేశారు. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి రెండు పాటలను విడుదల చేశారు. అవి అలరించేలా ఉన్నాయి. ట్రైలర్‌ కూడా అంచనాలను పెంచింది. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్‌ 5న విడుదల కాబోతుంది. దీన్ని ప్రాపర్‌ పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేయబోతున్నారు. అందుకే వరుసగా ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories