కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (నవంబర్ 24వ తేదీ)లో కాశీ, స్వప్నలను కలిపిన కార్తీక్. కాంచనకు బొట్టు పెట్టిన శ్రీధర్. పారుపై ఫైర్ అయిన కావేరి. గుడ్ న్యూస్ చెప్పిన దీప. సంతోషంలో కుటుంబం. షాక్ లో పారు, జ్యోత్స్న. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో మన మధ్య ఏవైనా గొడవలు ఉంటే ఇంటికి వెళ్లాక చూసుకుందాం.. ఇక్కడ అందరికి తెలియాలా అని స్వప్నతో అంటాడు కాశీ. నేనైనా తెలుసుకోవచ్చా అంటాడు కార్తీక్. ఏం లేదు బావ మేము ఊరికే మాట్లాడుకుంటున్నామని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు కాశీ. వచ్చిన దగ్గరి నుంచి చూస్తూనే ఉన్నా.. ఏమైంది అని స్వప్నను అడుగుతాడు కార్తీక్.
కాశీ నన్ను మోసం చేశాడు అన్నయ్య. జాబ్ రాకున్నా వచ్చిందని అబద్ధం చెప్పి రోజూ.. ఉదయం వెళ్లి సాయంత్రం వస్తున్నాడు. ఎన్ని రోజులని నాటకం ఆడుతాడు. ఓ రోజు దొరికిపోయాడని చెప్తుంది స్వప్న. నేను కావాలని చేయలేదు బావ. స్వప్నను బాధపెట్టొద్దనే ఆ విషయం చెప్పలేదు. ఈ లోపు జాబ్ దొరుకుతుందని అనుకున్నాను అంటాడు కాశీ.
భార్యాభర్తలిద్దరినీ మందలించి ఒక్కటి చేస్తాడు కార్తీక్. అది చూసి సంతోషిస్తాడు దాసు. అక్కడి నుంచి వెళ్లిపోతారు స్వప్న, కాశీ. నువ్వు ఇంకా ఎన్ని రోజులు నా కూతురిని భరించాలి కార్తీక్ అంటాడు దాసు. తప్పదు మామయ్య. నేను చక్కబెట్టాల్సిన సమస్యలు ఇంకా ఉన్నాయి. అమ్మానాన్నలను కలపాలి అంటాడు కార్తీక్.
26
పారుపై ఫైర్ అయిన కావేరి
మరోవైపు బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది కాంచన. కోడలికి ఏమైనా అవుతుందని భయపడుతున్నావా కాంచన అంటూ వెళ్తాడు శ్రీధర్. కోడలు అంటే కొడుకులో సగ భాగం. తను బాగుంటేనే కొడుకు బాగుంటాడు. చాలామందికి ఈ విషయం తెలియక కోడళ్లను ఇబ్బంది పెడుతుంటారు అంటుంది కాంచన.
భార్యాభర్తల బంధం గురించి ఇంత బాగా చెప్తున్నావు. అలా నా గురించి ఎందుకు ఆలోచించడం లేదు అని పక్కనే ఉన్న కుంకుమ తీసుకొని కాంచనకు బొట్టు పెడతాడు శ్రీధర్. ఇంతలో కావేరి వస్తుంది. ఆ సీన్ చూసి కావేరి సంతోషిస్తుంది. కాంచన కాస్త ఇబ్బంది పడుతుంది.
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిలా భలే ఉన్నావు అల్లుడు అంటుంది పారు. నీకు ఎప్పుడూ ఇదే గోలా? నీ కళ్లు పడితే పచ్చని కాపురం కూడా కూలిపోతుంది అంటుంది కావేరి. ఎంత మాట అన్నావే.. నిన్ను నా ఇంటికి రమ్మనడమే నేను చేసిన తప్పు అంటుంది పారు. కాశీ, స్వప్నలను తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అని కావేరితో చెప్తాడు శ్రీధర్.
36
వాంతులు చేసుకున్న దీప
దీపకు సేవలు చేస్తుంటుంది సుమిత్ర. దీప స్పృహలోకి వస్తే జ్యూస్ తాగించడానికి ప్రయత్నిస్తారు కార్తీక్, సుమిత్ర. వాంతు వచ్చేలా ఉందని లేచి వాష్ రూమ్ కి వెళ్తుంది దీప. కంగారు పడతాడు కార్తీక్. డాక్టర్ కి ఫోన్ చేయమంటాడు శివన్నారాయణ. దీపను చూసిన డాక్టర్.. టెస్ట్ చేయాలి మీరు బయటకు వెళ్లండి అని అందరిని బయటకు పంపిస్తుంది.
ఒక మంచి మనసుకు తీసుకునే లోపే ఏదో ఒక చెడు జరుగుతోంది అని బాధపడుతాడు దశరథ. హోమం జరిగితే వారసురాలికి మంచి జరుగుతుందని అన్నారు. నాకైతే ఆ సూచనలు ఏమి కనిపించడం లేదు అంటాడు దశరథ. కనపడవు వినిపిస్తాయి అంటాడు గురువు. ఏదైనా జరగబోతుంది అంటే అది మనకు స్వప్నం రూపంలోనో లేక ఇంకేదో ఒక రూపంలో తెలుస్తుందని చెప్తాడు గురువు.
56
కల గురించి చెప్పిన కాంచన
తనకు వచ్చిన కల గురించి చెప్పబోతాడు శివన్నారాయణ. నాకు అమ్మ కలలో వచ్చింది నాన్న అని చెప్తుంది కాంచన. ఏం చెప్పింది అమ్మా అని అడుగుతాడు దశరథ. మళ్లీ మీ ముందుకు వస్తాను అని చెప్పింది అన్నయ్య అంటుంది కాంచన. అత్త కూడా డ్రామా మొదలుపెట్టింది అని పారుతో అంటుంది జ్యోత్స్న.
66
దీప ప్రెగ్నెంట్
డాక్టర్, సుమిత్ర, దీపను తీసుకొని బయటకు వస్తారు. దీపకు ఏమైదంని అందరు కంగారుగా అడుగుతారు. ఏం కాలేదు అంతా బాగుంది. కార్తీక్ తండ్రి కాబోతున్నాడు. దీప ప్రెగ్నెంట్ అని చెప్తుంది డాక్టర్. కుటుంబమంతా సంతోషిస్తారు. జ్యో, పారు మాత్రం షాక్ అవుతారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.