ప్రేమించి మోసపోయింది.. సిల్క్ స్మిత చనిపోవడానికి కారణం ఇదే..

Published : Nov 24, 2025, 08:00 AM IST

Silk Smitha: నటి అనూజ రెడ్డి సిల్క్ స్మిత జీవితంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో సిల్క్ స్మితకు ఉన్న అసాధారణ క్రేజ్, ఆమె స్వయంకృషి, వ్యక్తిత్వం, ఆమె మరణం చుట్టూ అలుముకున్న మిస్టరీని అనూజ రెడ్డి వివరించారు.

PREV
15
చనిపోయేంతవరకు క్రేజ్ తగ్గలేదు..

సిల్క్ స్మిత జీవితం, ఆమె సినీ ప్రస్థానంపై కీలక విషయాలను నటి అనూజ రెడ్డి వెల్లడించారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అనురాధ వంటి డ్యాన్సర్లు పీక్‌లో ఉన్నప్పటికీ, సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ అసాధారణమని అనూజ రెడ్డి స్పష్టం చేశారు. సిల్క్ స్మితకు బ్రేక్ వచ్చినా మళ్ళీ వెంటనే పుంజుకునే శక్తి ఉందని, ఆమె చనిపోయేంతవరకు క్రేజ్ తగ్గలేదని అనూజ రెడ్డి వివరించారు.

25
క్యారెక్టర్ రోల్స్‌లో కలిసి నటించాం..

సిల్క్ స్మిత లేని సినిమాల్లో అనురాధ వంటి వారు అవకాశాలు దక్కించుకొని పికప్ అయ్యారని ఆమె అభిప్రాయపడ్డారు. సిల్క్ స్మిత అంటే మిగతా డ్యాన్సర్లకు భయమని, ఆమె ఉంటే ఆఫర్లు పెద్దగా రావని భావించేవారని తెలిపారు. సిల్క్ స్మితతో తనకు సినిమాలలో కలిసి సాంగ్స్ చేసే అవకాశం రాలేదని, తమిళం, కన్నడ భాషల్లో కొన్ని క్యారెక్టర్ రోల్స్‌లో కలిసి నటించామని అనూజ రెడ్డి పేర్కొన్నారు.

35
ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను కాపీ కొట్టేవారు..

బయట చాలామంది ఆమెను గర్విగా, పొగరుబోతుగా భావించినా, ఆమె చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పుడు కొందరు ఆమెను అవమానించారని, అలాంటి వారి పట్ల మాత్రమే ఆమె తన గర్వాన్ని చూపించేవారని అనూజ రెడ్డి వివరించారు. తన స్టైల్, డ్రెస్సులు, ఆభరణాలు, మేకప్ అన్నీ స్వయంగా ఎంచుకొని డిజైన్ చేసుకునేవారని, ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను చాలామంది హీరోయిన్లు, ఇతర నటీనటులు కాపీ చేసేవారని ఆమె అన్నారు.

45
హీరో అర్జున్ తప్ప మరెవరూ రాలేదు..

అంత మంచి వ్యక్తి అంత్యక్రియలకు సినిమా పరిశ్రమ నుంచి అర్జున్ తప్ప మరెవరూ రాలేదని అనూజ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె డేట్స్ కోసం హీరోలు ఎదురుచూసిన రోజులు ఉన్నాయని, కానీ ఆమె మరణించినప్పుడు ఆమెకు తోడుగా ఎవరూ లేకపోవడం దురదృష్టకరమని అనూజ రెడ్డి అన్నారు.

55
మరణించినప్పుడు అద్దె ఇంట్లోనే..

ఆమె మరణించినప్పుడు అద్దె ఇంట్లోనే ఉన్నారని, ఆమె దగ్గర పైసా కూడా లేదని, ఆమె డాక్టర్లు ఆస్తులను లాగేసుకున్నారని అనూజ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులు ఒంగోలు లేదా ఏలూరులో ఉండవచ్చని పేర్కొన్నారు. సిల్క్ స్మితకు డ్యాన్స్ అంతగా రాకపోయినా, ఆమె హావభావాలు, శరీర కదలికలతోనే ఇంతటి స్థాయికి ఎదిగారని అనూజ రెడ్డి అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories