`లెజెండ్`గా చిరంజీవి పట్టం..
టాలీవుడ్‌లో `లెజెండ్` ప్రస్తావన ఒక వివాదాస్పదమైన విషయం. ఎవరు లెజెండ్ అనేది ప్రశ్న. లెజెండ్ బిరుదు ఎవరికి ఇవ్వాలనేది, ఇండస్ట్రీ పెద్దగా ఎవరిని గుర్తించాలనేది చాలా కాలంగా ఉన్న ప్రశ్న. అదే సమయంలో వివాదాస్పదంగా మారిన విషయం కూడ. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవిని `లెజెండ్`గా గుర్తించాలని ఇండస్ట్రీ అంతా అనుకున్నారు. తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో దీనికి ప్లాన్ చేశారు. ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని సత్కరించాలని, లెజెండ్ కిరీటం, చేతికి కడియం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
చిరుకి మోహన్‌బాబు కౌంటర్..
కానీ ఆ సమయంలోనే వివాదం అయ్యింది. మోహన్‌బాబు నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఐదు వందలకుపైగా సినిమాలు చేశాను, విభిన్న పాత్రలు పోషించాను. ఎన్నో సినిమాలు నిర్మించి ఉపాధి కల్పించాను, విద్యాసంస్థలు పెట్టి విద్యా దానం చేస్తున్నాను, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, రాజకీయాల్లోనూ సేవ చేస్తున్నాను అంటూ ఆయన వెల్లడించారు.
తాను లెజెండ్ కాదా అంటూ వెల్లడించారు. పరోక్షంగా చిరంజీవికి, ఆయనకు లెజెండ్ బిరుదు ఇవ్వాలనుకున్న ఇండస్ట్రీ పెద్దలకు చురకలు అంటించారు. ఆ ఘటనతో ఆ సత్కరానికి దూరంగా ఉన్నాడు చిరంజీవి, వాటిని ఓ బాక్స్ లో దాచి పెడతా అని, అర్హత పొందినప్పుడు దాన్ని స్వీకరిస్తానని తెలిపారు చిరంజీవి.
read more: మహేష్ బాబు - నందమూరి బ్రహ్మణి కాంబోలో మిస్ అయిన సినిమా..?
లెజెండ్‌కి అర్థమేంటి?
ఆ తర్వాత ఇటీవల ఏఎన్నార్ జాతీయ అవార్డుల సమయంలో పరోక్షంగా ఆ ఘటనపై సెటైర్లు పేల్చాడు చిరంజీవి. తనకు ఇప్పుడు సంతృప్తిగా ఉందంటూ, ఇప్పుడు తాను అర్హుడిగా భావిస్తున్నట్టు తెలియజేస్తూ ఆ ఘటన గుర్తుకు వచ్చేలా కామెంట్ చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అంతేకాదు తాను `లెజెండ్`ని అని ప్రకటించుకున్నారు. ఆయన హోస్ట్ గా `అన్‌స్టాపబుల్` షో రన్ అవుతున్న విషయం తెలిసిందే.
నేనే లెజెండ్‌ః బాలయ్య..
ఇందులో బాలకృష్ణ తాను `లెజెండ్`ని వెల్లడించారు. `లెజెండ్` కోసం పోట్లాడుకున్నారు. లెజెండ్ అంటే ఏంటి? ఎవరికి తెలుసు దాని అర్థం. అందరు ఎక్కడికెళ్లిన లెజెండా లెజెండా అని పిలుస్తుంటారు. అరే లెజెండా కాదు లెజెండ్ అని చెబుతుంటాను. వాళ్లు వాళ్లు కొట్టుకు చచ్చారు. ఎవరు లెజెండ్ అని.
ఇన్ని సినిమాలు చేశా అని, అన్ని సినిమాలు చేశామని చెప్పుకుంటారు. కానీ నేను యాభై ఏళ్లలో ఎన్ని పాత్రలు చేశాను. విభిన్నమైన పాత్రలు చేశాను, గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు, పౌరాణిక సినిమాలు, జానపద చిత్రాలు, సైన్స్ ఫిక్షన్ అయితేనేమి, మనం అడుగుపెట్టని నేపథ్యం లేదు.
అలాంటి నేపథ్యాలతో జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి, అలాంటి సినిమాలన్నింటిని విజయవంతం చేసి, నన్ను ఒక లెజెండ్‌గా నిలబెట్టిన నా తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికి, అభిమానులందరికి లెజెండ్ అంటే ఏంటో నేను చెప్పక్కర్లేదు, మీరేచెప్పారు` అని వెల్లడించారు బాలయ్య.
చిరంజీవి, మోహన్‌బాబులకు కౌంటర్..
పరోక్షంగా ఆయన అటు చిరంజీవి, ఇటు మోహన్‌బాబులకు కౌంటర్లు వేశారు. లెజెండ్ కోసం వాళ్లు వాళ్లు కొట్టుకున్నారంటూ పరోక్షంగా సెటైర్లు వేశారు. తాను నిజమైన లెజెండ్ అని వెల్లడించారు బాలయ్య. వాళ్లు కాదు, తానే నిజమైన లెజెండ్ ని అని, జనం గుండెల్లో తాను ఉన్నానని, వాళ్లే తాను లెజెండ్‌ని అని చెబుతున్నారని తెలిపారు బాలయ్య. పరోక్షంగా ఆయన కొత్త రచ్చకి నిప్పంటించారు. ఇది ఎటు వైపు వెళ్తుందో చూడాలి.
ప్రస్తుతం బాలయ్య `డాకు మహారాజ్` చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచింది. మాస్ యాక్షన్ ఫీస్ట్ ఇవ్వబోతుందనిపిస్తుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటిస్తుంది. బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదల కాబోతుంది.
read more: నా జీవితాన్ని నాశనం చేశాడు, త్రివిక్రమ్‌పై మరోసారి పూనమ్ కౌర్ ఆరోపణలు.. `మా` కౌంటర్
also read: పవన్ కళ్యాణ్ `గేమ్ ఛేంజర్` వేదికగా వార్నింగ్ ఇచ్చాడా? అహంకారం చూపిస్తున్నది ఎవరు?