వెంకటేశ్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు.
దిల్‌రాజు సమర్పకులు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది (Sankranthiki Vasthunnam).ఈ కాంబినేషన్ లో గతంలో F2, F3 చిత్రాలు రావటంతో ఈ సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి.