ఇక పూనమ్ కౌర్ తెలుగులో హీరోయిన్‌గా మెప్పించింది. 2006లో `మాయాజాలం` అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఇందులో శ్రీకాంత్ సరసన నటించింది. ఆ తర్వాత `ఓ విచిత్రం`, `నిక్కి అండ్ నీరజ్`, `శౌర్యం`, `వినాయకుడు`, `ఈనాడు`, `గణేష్`, `నాగవళ్లీ`, `గగనం`, `బ్రహ్మిగాడి కథ`, `ఆడు మగాడ్రా బుజ్జి`,
`పొగ`, `సూపర్ స్టార్ కిడ్నాప్`, `ఎటాక్`, `నాయకి`, `శ్రీనివాస కళ్యాణం`, `నెక్ట్స్ ఏంటి?` వంటి సినిమాల్లో నటించింది. దాదాపుఆరేడు ఏళ్లుగా ఆమెకి సినిమాలు లేవు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. బీజీపీ నాయకురాలిగా రాణిస్తుంది పూనమ్ కౌర్.
read more: `గేమ్ ఛేంజర్` సినిమాకి కొత్త చిక్కులు.. అక్కడ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటుందా?