అరిజిత్ సింగ్ ఇకపై ప్రొఫేషనల్ వర్క్ ఆపేస్తున్నారు. కానీ సొంతంగానే పాటలు పాడబోతున్నారనే విషయాన్ని ఈ దిగ్గజ సింగర్ వెల్లడించారు. ఇకపై ఆయన సినిమాలకు పాటలు పాడటం గానీ, మ్యూజిక్ చేయడం గానీ చేయబోడనే విషయాన్ని స్పష్టం చేశాడు. అర్జిత్ సింగ్ ప్లేబ్యాక్ సింగర్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా, మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ సంగీత సారథ్యంలో ఎక్కువగా పాటలు పాడారు.
అరిజిత్ సింగ్ పాటలు పాడిన తెలుగు సినిమాలు
అరిజిత్ సింగ్ ఇప్పటి వరకు తన కెరీర్‌లో 715పాటలు పాడారు. వాటిలో హిందీలో 532, బెంగాలీలో 144 పాటలు, తెలుగులో 25 పాటలు, తమిళంలో నాలుగు పాటలు పాడారు. అలాగే మ్యూజిక్ కంపోజర్‌గా దాదాపు 28 సినిమాలకు వర్క్ చేశారు. ఇక ఆయన తెలుగులో `కేడీ`, `మనం`, `స్వామి రారా`, `ఉయ్యాల జంపాలా`, `రౌడీ ఫెలో`, `దోచెయ్`, `భలే మంచి రోజు`, `తను నేను`, `కేశవ`, `నా పేరు సూర్య`, `హుషారు`, `బ్రహ్మాస్త్ర`, `ఓం భీమ్ భుష్` వంటి చిత్రాల్లో పాటలు పాడారు. `మనం`లో కనులను తాకే ఇలా అనే పాటని ఆయనే పాడారు. హిందీలో అనేక సూపర్ హిట్ సాంగ్స్ ని అలపించారు అరిజిత్ సింగ్.