ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌తో అనుష్క శెట్టి రహస్య పెళ్లి?.. స్వీటి అంత బాగా చెప్పిన తర్వాత కూడా డౌటా?

First Published | Nov 8, 2024, 8:01 PM IST

స్వీటి అనుష్క శెట్టి పెళ్లికి సంబంధించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలా మందితో డేటింగ్‌, పెళ్లికి రెడీ అంటూ పుకార్లు వైరల్‌ అయ్యాయి. కానీ ఓ డైరెక్టర్‌తో స్వీటి రహస్య పెళ్లి అనేది సంచలనంగా మారింది. 

ఈ గరువారమే అనుష్క 43వ వసంతంలోకి అడుగుపెట్టింది( నవంబర్ 7). అభిమానులు, నెటిజన్లు ఆమెకి అభినందనలతో ముంచెత్తుతున్నారు. బర్త్ డే విషెస్‌ చెబుతున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా అనుష్క మరోసారి డిస్కషన్‌ పాయింట్‌గా మారింది. ఆమె మ్యారేజ్‌ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే ఓ షాకిచ్చే విషయం ఇందులో ఉండటం విశేషం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అనుష్క.. సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌తో కొనసాగుతున్న విసయం తెలిసిందే. ఆమె స్టార్‌ హీరోలకు ధీటుగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. బాక్సాఫీసు వద్ద కూడా తన సత్తాని చాటుకుంటుంది. అయితే ఇటీవల ఆమెకి సరైన హిట్‌ పడలేదు. త్వరలోనే ఆమె తన మార్క్ భారీ కంటెంట్‌తో రాబోతుంది. `ఘాటి` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే అనుష్క సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండదు, తన ప్రైవసీని కోరకుంటుంది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అడపాదడపా ఒకటి అర పోస్ట్ లు పెట్టినా యమ క్రేజ్‌ ఆమె సొంతం. ఈ క్రమంలో తన ఫాలోయింగ్‌ కూడా బాగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ల మంది అనుచరులు ఉన్నప్పటికీ, అనుష్క తన జీవితం గురించి చాలా అరుదుగా పోస్ట్ చేస్తుంది.  కానీ  ఎక్కువగా తన సినిమాలను ప్రమోట్ చేయడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తుంది. పర్సనల్‌ విషయాలను మాత్రం గోప్యంగానే ఉంచుతుంది. తన జీవితాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడదు అనుష్క.  


ప్రకాష్ కోవెలమూడి

సోషల్‌ మీడియాలోనే కాదు, బయటకు కూడా తాను పూర్తి ప్రైవేట్‌ పర్సన్‌. ఎవరితోనూ డేటింగ్‌ లో లేదని తెలుస్తుంది. ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటుందని సమాచారం. కానీ గతంలో చాలా మందితో ఆమె డేటింగ్‌ రూమర్స్ వచ్చాయి. ప్రభాస్‌కి సంబంధించి ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ గోపీచంద్‌, డార్లింగ్‌, నాగార్జున వంటి వారితోనూ రూమర్లు వచ్చాయి. వారిలో ఓ ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌ కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు అత్యంత సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌, తెలుగు సినిమాని కొత్తపుంతలు తొక్కించిన దర్శకుడు కె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి కావడం విశేషం.

ఆయనతో ఏకంగా అనుష్క పెళ్లికి సిద్ధమైందని, రహస్యంగా మ్యారేజ్‌ కూడా చేసుకున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పుడు అనుష్క బర్త్ డే సందర్భంగా మరోసారి ఆ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ గతంలో 2015లో `సైజ్ జీరో` సినిమాలో కలిసి పనిచేశారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారు ప్రేమలో పడ్డారు. 2020లో వీరిద్దరు సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారనే రూమర్స్ వచ్చాయి. 

ఆ రూమర్స్ బాగా వినిపించిన నేపథ్యంలో దీనిపై అనుష్క స్పందించింది. మ్యారేజ్‌ రూమర్స్ ని ఖండించింది. ప్రకాష్‌ కోవెలమూడితో మ్యారేజ్‌ అనే విషయాన్ని ఆమె కొట్టిపారేసింది. రూమర్స్ ని నమ్మవద్దు అని తెలిపింది. అంతేకాదు ఇలాంటి పుకార్లు తనని ప్రభావితం చేయలేవని అనుష్క స్పష్టం చేయడం విశేషం.  తాను పెళ్లి చేసుకుంటే ఆ విషయం అందరికి తెలుస్తుందని చెప్పింది అనుష్క. 

ఆమె మాట్లాడుతూ, `ఈ వార్తల్లో ఏదీ నిజం కాదు. ఇలాంటి పుకార్లు నన్ను ప్రభావితం చేయవు. నా పెళ్లి అందరికీ ఎందుకు అంత పెద్ద విషయమో నాకు అర్థం కావడం లేదు. ఎవరూ తమ బంధాన్ని దాచుకోలేరు. నేను నా పెళ్లిని ఎలా దాచుకోగలను? ఇది చాలా సున్నితమైన విషయం, ప్రజలు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నాకంటూ ఓ ప్రైవేట్‌ స్పేస్‌ ఉంది. ఇతరులు దానిలోకి చొరబడటం నాకు ఇష్టం ఉండదు. నిజంగానే నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీకు కచ్చితంగా చెబుతాను` అని వెల్లడించింది స్వీటి అనుష్క. 

ఇదిలా ఉంటే అనుష్క.. ప్రకాష్‌ కోవెలమూడితోపాటు ఓ దుబాయ్‌కి చెందిన బిలియనీర్‌ని కూడా మ్యారేజ్‌ చేసుకోబోతుందనే రూమర్స్ వచ్చాయి. అరెంజ్‌ మ్యారేజ్‌గా ఇది ఉండబోతుందని అన్నారు.  కానీ దీనిపై అనుష్క గానీ, వారి ఫ్యామిలీగానీ స్పందించలేదు. అనుష్క మ్యారేజ్‌ రూమర్‌లో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ప్రస్తుతం అనుష్క `ఘాటి` అనే సినిమాలో నటిస్తుంది. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ గ్లింప్స్ ఆమె పుట్టిన రోజు సందర్భంగా గురవారం విడుదలైంది. ఇందులో అనుష్క చాలా పవర్‌ఫుల్‌ మాస్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రత్యర్థి పీకలు పట్టుకుని కోయడం షాకిస్తుంది. అనుష్క కమ్‌ బ్యాక్‌ వేరే లెవల్‌లో ఉండబోతుందని అర్థమవుతుంది. 

read more:సుస్మితతో ఎంగేజ్‌మెంట్‌కి ముందు ఉదయ్‌ కిరణ్‌ ఎవరిని ప్రేమించాడో తెలుసా? చిరంజీవి చేరదీయడం వెనుక ఇంత కథ ఉందా?

Also read: `జాతర` సినిమా రివ్యూ, రేటింగ్.. మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

Latest Videos

click me!