ఠాగూర్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..

First Published | Nov 8, 2024, 6:43 PM IST

గెట్ రెడీ మెగా ఫ్యాన్స్.. అభిమానులు దిల్ ఖుష్ అయ్యే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. మెగాస్టార్ సూపర్ హిట్ సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతోంది. ఇక ప్యాన్స్ కు పండగే. ఇంతకీ ఈసినిమాకు దర్శకుడు ఎవరంటే..? 
 

మెగాస్టార్ అంటే ఓ ప్రభంజనం. ఆయన కనుసైగకు లక్షలాదిమంది అభిమానులు తరలి వస్తారు. ఆయన సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ కు అది పెద్ద పండగ. ఆ సినిమా సూపర్ హిట్ అయితే.. అది ఇంకా పెద్ద పండగ. మరి అలాంటి పండుగ మళ్లీ వస్తే.. బంపర్ ఆఫర్ తగిలినట్టే. త్వరలో చిరంజీవి అభిమానులకు ఇలాంటి ఆఫర్ రాబోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే..? 

Also Read: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త, మెగా డాటర్ కు షాక్ ఇచ్చిన చైతన్య ..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలు ఇప్పటికీ టీవీలో వస్తే.. మిస్ అవ్వకుండా టీవీల ముందే కూర్చుని చూస్తుంటారు.

అలాంటి సినిమాలకు సీక్వెల్స్ వస్తే బాగుంటు అనుకుంటుంటారు.  ఖైదీ,గ్యాంగ్ లీడర్, శంకర్ దాదా,  ఠాగూర్,లాంటివి ఆ కోవలోకి వచ్చే సినిమాలు. ఇలాంటి సినిమాలు ఇంతే  ఎఫెక్టీవ్ గా మళ్లీ తీసినా.. ఫ్యాన్స్ పక్కాగా ఆదరిస్తారు. ఇక ఇప్పుడు అలాంటి న్యూస్ ఒకటి వారిని సంబరపెడుతోంది.

ఇంతకీ విషయం ఏంటంటే.. ఠాగూర్ సినిమాకు సీక్వెల్ చేయాలని చూస్తున్నారట చిరంజీవి. ప్రస్తుతం  విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేయబోయే సినిమా గురించి ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. 

Also Read:తనకంటే 16 ఏళ్ళు పెద్ద హీరోని పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?


అయితే విశంభర తరువాత ఆయన ఏసినిమా చేస్తారు అనేది ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఆయితే మెగాస్టార్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ విషయంలో రీసెంట్ గా ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి.

బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్‌ రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చారు.విశ్వంభర షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేయటంతో చిరు నెక్ట్స్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది.

బీవిఎస్ రవి చిరంజీవి కోసం అద్భుతమైన కథను రెడీ చేశారట. అది కూడా మాస్ , కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీని రాసుకున్నారట రవి. అంతే కాదు చిరంజీవికి ఈ కథను వినిపించడం.. ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. 

Also Read: దివ్యభారతి మరణ రహస్యం తెలిసిపోయింది..? 20 ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం..?

అయితే దర్శకుడి విషయంలోనే ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా దాదాపు ఠాగూర్ రేంజ్ లో ఉంటుందట. అటువంటి కథలను డీల్ చేయడంలో వివి వినాయక్ తరువాతే ఎవరైనా. అందులోను.. చిరంజీవి ఇమేజ్ ను, ఆయన రేంజ్ ను తట్టుకుని మెయింటేన్ చేయాలంటే వినాయక్ కరెక్ట్ అనుకుంటున్నారట. 

Also Read: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్, త్వరలో ఎంట్రీ.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

పైగా ఠాగూర్ డైరెక్ట్ చేసింది వినాయకే. పైగా పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చిన తరువాత చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150 వినాయక్ డైరెక్షన్ లోనే వచ్చింది. అంత ప్రెజర్ ను హ్యాండిల్ చేసిన వాడు.. ఈసినిమా చేయడం పెద్ద కష్టమేమి కాదు.

అందుకే..చిరు ఇమేజ్‌ను డీల్ చేయటంతో పాటు..,తెలుగు ఆడియన్స్‌ పల్స్‌ కూడా పర్ఫెక్ట్‌గా తెలిసిన కమర్షియల్ డైరెక్టర్‌ కాబట్టి వినాయక్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వినాయక్ కాదు అనుకుంటే మాత్రం నెక్ట్స్ ఆప్షన్ గా తమిళ దర్శకుడు మోహన్‌రాజా ఉన్నట్టు తెలుస్తోంది.

చిరంజీవితో గాఢ్ ఫాదర్ సినిమా చేశారు మోహన్ రాజా. ఈసినిమా తరువాత మళ్లీ మోహన్ రాజాకు సినిమా చేస్తానని చెప్పారట చిరు. దాంతో ఆయనకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఠాగూర్ సీక్వెల్ అనౌస్స్ చేసే.. ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటోందో చెప్పనక్కర్లేదు. మరి ఆసినిమా ఎప్పుడు  వస్తుందు..? ఇందులో నిజమెంత తెలియాలంటే వెయిట్ అండ్ సీ. 

VV Vinayak, Vassishta, Vishwambhara, chiranjeevi

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట్ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అవ్వడానికి వస్తోంది. సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం మెగాస్టార్ చిరంజీవి తన సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పుకుని.. సమ్మర్ కు రంగంలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. 

Latest Videos

click me!