ఇండియాలో ఉన్న అత్యంత ధనికి సినిమా కుటుంబంలో అక్కినేని కుటుంభం కూడా ఒకటి. వేల కోట్ల ఆస్తి ఉన్న హీరోలలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకరు. ఆయన హీరోగా ఎంత స్టార్ డమ్ చూశారో..వ్యాపారవేత్తగా కూడా అంతే ఎదిగారు. ఇటు హీరోగా నటిస్తూనే.. అటు తన వ్యాపార సాంమ్రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు.. సినిమా స్టూడియోతో పాటు.. సినిమా నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్లు, ఇతర రంగాల్లో పెట్టుబడులు, హోటల్స్.... టీవీ ఛానల్స్, ఇలా నాగార్జున చేయి వేయని రంగం లేదేమో
రామ్ చరణ్ ఓకే అంటే.. నేను రెడీ.. డైరెక్టర్ కృష్ణ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...
అయితే వీరి కుంటుభానికి ఉన్న అతి పెద్ద ఆస్తుల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియో. ఆస్తులన్నింటిలో ఇది ముందు వరుసలో ఉంటుంది.మొదటి తరం హీరోగా.. ఫిల్మ్ఇండస్ట్రీని నిలబెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. చెన్నై నుంచి మొదటగా హైదరాబాద్ కు వచ్చి.. 1976లో ఈ స్టూడియోను స్థాపించారు. ఒకప్పుడు సౌత్ సినిమా అంటే.. మద్రాస్ పేరు వినిపించేది. ఏది చేయాలన్నా అక్కడికే వెళ్లేవారు. సినిమాకు సబంధించిన అన్ని వసతులు అక్కడే ఉండేవి.
రహస్యం చెప్పిన రజినీకాంత్, తన ఆరోగ్యం గురించి ఏమన్నాడంటే..?
కాని హైదరాబాద్ లో కూడా సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని.. మొదటగా మద్రాస్ వదిలి హైదరాబాద్ కు వచ్చారు నాగేశ్వరావు, సినీ రంగానికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానం అంతా చెన్నైలో ఉన్న సమయంలో... మద్రాసు కేంద్రంగా సినిమాలను నిర్మించే టైమ్ లో తెలుగు వారికి కూడా ఈ సౌకర్యాలు తెలుగు గడ్డపై ఉండాలన్న ఆశతో.,. మొదటిగా అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు నాగేశ్వరావు.,
అప్పట్లో తెలుగుతో పాటు.. తమిళ్, కన్నడ, మలయాళ భాషలు కూడా మద్రాస్ లోనే ఉండేవారు. అక్కడే సినిమాలు సౌత్ సినిమాలన్నీ అక్కడే నిర్మించేవారు.. అక్కడే నివసించేవారు. 1970లో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం ఉండాలని.. తమకంటూ ప్రత్యేకమైన సినీ పరిశ్రమను ఏర్పర్చుకోవాలని అగ్ర నటులందరూ పోరాటం చేశారు.
ఈ నేపథ్యంలోనే 1973 నాటి సీఎం జలగం చెంగలరావు గారు చొరవ చేసి హైదరాబాద్ లో స్థలం కేటాయించడంతో ..ఏఎన్నార్ గారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 22 ఎకరాల స్థలంలో స్టూడియో ను నిర్మించారు. ఇక 1976 జనవరి 14న ఇండియన్ ప్రెసిండెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమైంది.
Akkineni Nageswararao
ఇక్కడ కూడా అన్ని సౌకర్యాలు ఉండటంతో.. హైదరాబాద్ లో కూడా సినిమాల నిర్మాణం ఊపు అందుకుంది. స్టార్ హీరోలు మెల్లగా హైదరాబాద్ రావడంస్టార్ట్ అయ్యింది. చిన్నగా టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం పక్క రాష్ట్రాలతో పాటు.. బాలీవుడ్ కూడా హైదరాబాద్ లో సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది.
ఇక అన్న పూర్ణ స్టూడియోస్ తెలుగు పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడానికి కారణం అయితే.. రామోజీ ఫిల్మ్ సిటీ తెలుగు పరిశ్రమకుమకుటంగా నిలిచింది. టాలీవుడ్ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేసింది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ తో ఆపకుండా.. కింగ్ నాగార్జున దీన్ని విస్తరించి..2011లో అక్కినేని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పేరుతో విద్యా సంస్థను కూడా ప్రారంభించింది.
Nagarjuna Akkineni
ఇక ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ను కింగ్ నాగార్జున నడిపిస్తున్నారు. స్టూడియోతో పాటు..ప్రొడక్షన్ కంపెనీకి, ఫిల్మ్ స్కూల్ కు కూడా నాగార్జునానే అధినేత ఉన్నారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం విలువ 700 నుంచి 1000 కోట్ల మధ్య ఉంటుందని అంచన. ఈ విషయం వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. పలువురు వేసిన అంచనాల ప్రకారం, సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ విలువ ఉంటుందని తెలుస్తోంది