అంజలి క్రైమ్ వెబ్ సీరిస్ 'బహిష్కరణ' రివ్యూ

First Published | Jul 19, 2024, 5:10 PM IST

 సెన్సిటివ్ కంటెంట్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్. మొదటి ఎపిసోడ్స్ భరిస్తే మిగతావి నడిపించేయచ్చు. 

Bahishkarana

వేశ్య పాత్రలో కనపించటం అంటే తమను తాము ప్రూవ్ చేసుకోవటానికి అని ఒకప్పటి హీరోయిన్స్ భావించేవారు.  అయితే అలాంటి పాత్రలు ఎప్పుడో కానీ దొరికేవి కావు. కానీ ఓటిటిలు వచ్చాక వెబ్ సీరిస్ లు, సినిమాలు అంటూ వైవిధ్యమైన కంటెట్ లు డైరక్టర్స్ టచ్ చేస్తున్నారు. ఆ క్రమంలో వేశ్య పాత్రలు హీరోయిన్స్ కు ఈజీగానే దొరికేస్తున్నాయి. అంతెందుకు రీసెంట్గా  విశ్వక్ సేన్(Vishwak Sen)’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) లో కూడా అంజలి దాదాపు  వేశ్య పాత్రలాంటిదే చేసింది. ఇప్పుడు ‘బహిష్కరణ’ లో కూడా అలాంటి పాత్రే చేసి మరోసారి మన ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ వెబ్ సీరిస్ ఎలా ఉంది. చూడదగ్గ కంటెంట్ ఉందా ఏమిటో చూద్దాం. 
 

Bahishkarana

స్టోరీ లైన్

పెద్ద పల్లి అనే ఊరు. అక్కడ ప్రెసిడెంట్ శివయ్య(రవీంద్ర విజయ్)  దే రాజ్యం. ఆయన మాటే శాశనం. కంగారుపడకండి ఇది ఇప్పటి కథ కాదు తొంభైల్లో జరుగుతుంది.  ఆ ఊరుకి వెతుక్కుంటూ పుష్ప(అంజలి)  వస్తుంది. ఆమె అందం శివయ్యను నిద్రలేకుండా చేస్తుంది. దాంతో ఆమెను తన సెటప్ గా పెట్టేసుకుని ఊరి చివర పెడతాడు. ఇదిలా ఉంటే  శివయ్యకు కుడి భుజం అయిన దర్శి (శ్రీతేజ్) ఉంటాడు. దర్శి లేనిదే శివయ్య ఏ పని చేయడు. అలాంటి దర్శి కూడా  పుష్ప తో ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె కూడా దర్శిని ప్రేమిస్తుంది. 
 


Bahishkarana

వీళ్ల ప్రేమ కథ శివయ్యకు తెలిసి... పెళ్లి చేసుకోవటానికి ఫర్మిషన్ ఇస్తాడు. ఇద్దరూ  తెగ ఆనందపడిపోయి పెళ్లి షాపింగ్ కు వెళ్లి వచ్చేసరికి శివయ్య ఆ పెళ్లి ఆపటానికి ఓ స్కెచ్ రెడీ చేస్తాడు. దర్శి మరదలు లక్ష్మీ(అనన్య నాగళ్ళ (Ananya Nagalla)ని సీన్ లోకి తెస్తాడు. ఆమెతో దర్శి పెళ్లి చేసుకునే పరిస్దితులు కల్పిస్తాడు. ఇదంతా పుష్ప కళ్ల ఎదురుగా జరుగుతుంది. ఆమె గుండె రగలిపోతుంది. 

Bahishkarana

మరో ప్రక్క దర్శి కు ప్రేమించిన  పుష్ప దక్కకపోవటంతో ఆ బాధతో తాగుడుకు అలవాటు పడతాడు. అప్పుడు లక్ష్మి తన భర్తను తాగుడు నుంచి బయిటపడేసే ప్రయత్నాలు చేస్తుంది. తన ప్రేమతో అతన్ని మామూలు మనిషిని చేస్తుంది. అయితే ఈలోగా దర్శి ఓ రేప్ కేసులోనూ, మర్డర్ కేసులోనూ జైలుకు వెళ్ళే సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమైంది. అసలు దర్శి ఎందుకు ఆ కేసులో ఇరుక్కున్నాడు. పుష్ప జీవితం చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల ్సిందే. 
 

Bahishkarana

ఎనాలసిస్ ..

తెలుగు ఓటిటిలలో కంటెంట్ కూడా మారుతోంది.  క్రైమ్,సెక్స్ కంటెంట్ డోసేజి పెంచుతున్నారు.  సైతాన్ వంటి వెబ్ సీరిస్ లు తెలుగులో వచ్చి హై సక్సెస్ అవటంతో అలాంటివి మరెన్నో చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలా వచ్చిందే  'బహిష్కరణ' వెబ్ సీరిస్. అంజలి ప్రధాన పాత్రలో  రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జీ5 ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ రివేంజ్ డ్రామా, బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.  
 

Bahishkarana

ఇది పాతికేళ్ల వచ్చిన చాలా సినిమాలను గుర్తు చేస్తూ సాగే సీరిస్. అయితే కథ ఎప్పటిదైనా , ఏ కాలంకు చెందిన దైనా దాన్ని టైట్ స్క్రీన్ ప్లేతో ఒప్పించాలి. లేకపోతే జనం ఆ సీరిస్ లేదా సినిమాను మొహమాటం లేకుండా బహిష్కరిస్తాడు. డైరక్టర్ ఈ సీరిస్ లో చెప్పినవి చాలా వరకూ నిజాలే అయ్యిండవచ్చు. అయితే వాటిని చెప్పిన తీరు సరిగ్గా లేదు. చాలా ప్రెడిక్టబుల్ గా సీన్స్ సాగుతాయి. విలన్ ఎవరో తెలుసు..అతను ఏం చేస్తాడో తెలుసు...కొత్తగా ఏమీ అనిపించదు. ఇంతేకదా అనిపిస్తుంది. మూడో ఎపిసోడ్ నుంచి మెలోడ్రామాకు ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇచ్చారు కానీ ఇంటెన్స్ డ్రామాకు తెర తీయలేకపోయాడు. పాత విషయాలు కొత్త స్క్రీన్ ప్లే తో చెప్పకపోతే అవి ఆకట్టుకోవు.  స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ లేకపోవటం, మెల్లిగా కథ,కథనం నడవటం తో బోర్ కు దారి తీసింది.   

Bahishkarana

టెక్నికల్ గా ...

ఈ సీరిస్ టార్గెట్ ఏ ఆడియన్స్ ని ఉద్దేశించో కానీ మరీ పాతకాలం డ్రామా చూస్తున్న ఫీల్ తెచ్చారు. అలాగే  ‘రంగస్థలం’,‘రుద్రంగి’ సినిమాల్లో జగపతి బాబుని రిఫెరెన్స్ గా పెట్టుకున్నట్లున్నారు. ఆ షెడ్స్ కనపడతాయి.  మేకింగ్ ఎంగేజింగ్ చేసారు. దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ సీరిస్ ని నేచురల్ గానూ, రా అండ్ రస్టిక్ ఫీల్ వచ్చేలా తీర్చిద్దాడు.   ప్రొడక్షన్ వాల్యూస్  బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సీరిస్ ని నిలబెట్టే దిసగా వర్క్ చేసాయి. 
 

Bahishkarana

ఎవరెలా చేసారు

ఇక ఈ వెబ్‌ సిరీస్‌లో అంజలి పాత్ర సరికొత్తగా ఉందని చెప్పలేం కానీ... డిఫరెంట్ గా ట్రై చేసింది. ఆమె కళ్లలో  ఓ వైపు ప్రేమ కురిపిస్తూనే మ‌రో వైపు ఆగ్ర‌హావేశంతో ఊగిపోయేలో పాత్రలో తనలోని నటిని ఆవిష్కరించింది. అలాగే  బోల్డ్ సీన్స్‌లోనూ అంజలి రెచ్చిపోయి యాక్ట్ చేసంది. ఓవరాల్ గా సీరిస్ మొత్తాన్ని తన భుజంపై మోస్తూ ...తన క్యారెక్టర్‌లో భావోద్వేగాలను ఎంతో చక్కగా అభినయించించింది. శివయ్యగా రవీంద్ర విజయ్ నటన కూడా బాగుంది.    శ్రీతేజ్ కూడా తన పాత్ర మేరకు బాగా చేసారు.  
 

Bahishkarana

చూడచ్చా

 ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోకపోతే జస్ట్ ఓకే , ఓ సారి చూడచ్చు అనిపిస్తుంది. అంజలి ఉన్నా ప్యామీలి మొత్తం తో చూసే కంటెంట్ మాత్రం కాదు. 

Rating: 2.5

ఏ ఓటిటిలో ఉంది

జీ5 ఓటీటీ లో  తెలుగులో ఉంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి.  
 

Latest Videos

click me!