రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి యాంకర్ సుమ చెప్పిన కొన్ని విషయాలు.. వారి అభిమానులు కూడా షాక్ అయ్యేలా చేశాయి. ఇంతకీ ఈ ఇద్దరు హీరోల గురించి స్టార్ యాంకర్ వెల్లడించిన టాప్ సీక్రెట్ ఏంటి?
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, నటులు తాము చేసే మంచి పనులు బయటకు తెలియకుండా చూసుకుంటారు.. కొంత మంది మాత్రం ఎంత చిన్న పనిచేసినా.. భారీగా పబ్లిసిటీ చేసుకుంటారు. తమను ఎంతగానో ప్రేమించే అభిమానులకు కూడా తెలియకుండా... స్టార్ హీరోలు చేసే కొన్ని పనులు ఉంటాయి.. అవి తెలిసినప్పుడు ఆ అభిమానులు కూడా షాక్ అవుతుంటారు. అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. పవర్ స్టార్, రెబల్ స్టార్ అభిమానులకు.
25
పవన్, ప్రభాస్ టాప్ సీక్రేట్ బయట పెట్టిన సుమ
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు అంటే భారీ రెమ్యునరేషన్లు, కాస్ట్లీ కార్లు, ఇళ్లు, లగ్జరీ లైఫ్, మాత్రమే అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ అభిప్రాయానికి భిన్నంగా.. చాలామంది హీరోలు సమాజసేవ చేస్తూ.. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతుంటారు. రీసెంట్ గా మహేష్ బాబు వేల మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించిన విషయం తెలిసిందే.. వెయ్యిమంది పిల్లలకు సర్జరీలు కంప్లీట్ అయ్యేవరకూ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఏమాత్రం బయటకు రాలేదు. మహేష్ బాబు కూడా ఎప్పుడూ ఈ విషయం చెప్పుకోలేదు. ఇక ఇదే స్టైల్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్ కూడా సమాజసేవ చేస్తున్నారని మీకు తెలుసా? ఈ విషయం యాంకర్ సుమ వల్ల బయటకు వచ్చింది.
35
స్టార్ హీరోల మంచి మనసు..
రీసెంట్ గా ఓఈవెంట్ లో మాట్లాడిన యాంకర్ సుమ, పవన్ కళ్యాణ్ , ప్రభాస్ చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని ఖమ్మం ప్రాంతంలో ఒక వృద్ధాశ్రమం నిర్మాణానికి ఈ ఇద్దరు హీరోలు చాలా సహాయం చేశారని ఆమె తెలిపారు. ఈ విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదని, దీనిలో మరికొంతమంది కూడా భాగస్వాములయ్యారని సుమ వెల్లడించారు.అంతేకాదు, ఆ వృద్ధాశ్రమంలో నివసించే పెద్దల యోగక్షేమాల కోసం ప్రతినెలా అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా పవన్ కళ్యాణ్, ప్రభాస్ అందిస్తున్నారని యాంకర్ సుమ చెప్పారు. ఈ సహాయం ఎలాంటి ప్రచారం లేకుండా కొనసాగుతుందని ఆమె అన్నారు.
చిన్న చిన్న సహాయాలు చేసి.. గొప్పగా ప్రచారాలు చేసుకునే ఈ రోజుల్లో.. హీరోలుగా పేరు, ప్రతిష్ఠ ఉన్నప్పటికీ, సమాజ సేవ విషయంలో పవన్, ప్రభాస్ చూపించిన బాధ్యత నిజంగా ప్రశంసనీయమని అభిమానులు, నెటిజన్లు అంటున్నారు. యాంకర్ సుమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు ఈ విషయాలను తెగ వైరల్ చేస్తున్నారు.. తమ అభిమాన హీరోలు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండటం గర్వంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ నిలుస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
55
ప్రభాస్ సినిమాలు..
ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన రాజాసాబ్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈమూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మందుకు రాబోతోంది. మారుతీ డైరెక్ట్ చేసిన ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా తో పాటు.. ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ, సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. ఈసినిమాల తరువాత సలార్ 2, కల్కీ 2 సినిమాలను సెట్స్ పైకీ తీసుకెళ్లబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్.