Ram Charan: లెటర్ రాసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన రాంచరణ్.. సురేఖ, చిరంజీవి ఏం చేశారో తెలుసా ?

Published : Jan 03, 2026, 09:55 AM IST

రాంచరణ్ ఒకసారి తన తల్లిదండ్రులు సురేఖ, చిరంజీవి లని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. లెటర్ రాసి చిరంజీవి టేబుల్ పై పెట్టాడట. ఇంతకీ రాంచరణ్ రాసిన లెటర్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
మెగా పవర్ స్టార్ రాంచరణ్

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం రాంచరణ్ పెద్ది అనే చిత్రంలో నటిస్తున్నారు. రాంచరణ్ సినిమాల్లోకి రాకముందు, బాల్యంలో ఉన్నప్పుడు తన తండ్రి సినిమా షూటింగ్స్ కి అప్పుడప్పుడూ వెళ్లేవారు. స్కూల్ కి సెలవులు ఉన్నప్పుడు షూటింగ్స్ కి వెళ్ళేవాడు. కానీ ఫారెన్ లో షూటింగ్ ఉన్నప్పుడు వెళ్లడం అంత సులువు కాదు.

25
ముందుగా అమ్మనే అడుగుతా

ఇంద్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన జరిగిందట. ఈ విషయాన్ని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. నాకు ఏదైనా కావాలి అంటే ముందుగా అమ్మని అడుగుతాను. అమ్మ చేయలేకపోతే నాన్నని అడుగుతాను. ఇంద్ర షూటింగ్ సమయంలో నాన్న స్విట్జర్లాండ్ వెళుతున్నారు.

35
స్విట్జర్లాండ్ కి స్కెచ్ వేసిన చరణ్

దాయి దాయి దామ్మా సాంగ్ షూట్ కోసం చిత్ర యూనిట్ స్విట్జర్లాండ్ కి ప్లాన్ చేసుకున్నారు. అదే కరెక్ట్ గా సమ్మర్ టైం. మా స్కూల్ కి కూడా హాలిడేస్ ఇస్తున్నారు. అప్పటి వరకు నేను స్విట్జర్లాండ్ వెళ్ళలేదు. దీనితో ఎలాగైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యా.

45
లెటర్ రాసిన రాంచరణ్

ఎలాగైనా నాన్నని ఒప్పించాలి అని అనుకున్నా. కానీ డైరెక్ట్ గా అడగలేను. కాబట్టి ఒక పేపర్ తీసుకుని రాయడం మొదలు పెట్టాను. 'నాన్న నా హాలిడేస్ మొదలయ్యాయి. మా ఫ్రెండ్స్ అందరూ వెకేషన్స్ కి వెళ్లారు. మీరు ఏమీ అనుకోకపోతే నేనూ మీతో స్విట్జర్లాండ్ వస్తాను. మీ షూటింగ్ ని డిస్టర్బ్ చేయను. ప్లీజ్ నాన్న.. నో అని చెప్పొద్దు అని రాసి నాన్న టేబుల్ పై లెటర్ పెట్టాను.

55
చిరంజీవి చూసి ఏం చేశారంటే

నాన్న ఆ లెటర్ చూసి అమ్మని పిలిచారు. చూడు సురేఖ వీడు ఎలా లెటర్ రాశాడో.. అసలు రిక్వస్ట్ చేస్తున్నాడా ? ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు అని నవ్వుకున్నారు. మొత్తానికి నాన్న ఒప్పుకున్నారు. నీకు కూడా టికెట్ వేస్తాలే, నాతో స్విట్జర్లాండ్ కి రా అని చెప్పినట్లు రాంచరణ్ గుర్తు చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories