
యాంకర్ రవి ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా రాణించారు. లాస్యతో కలిసి ఆయన చేసిన టీవీ షోస్ మంచి ఆదరణ పొందాయి. వందల ఎపిసోడ్లు నడిచాయి. బుల్లితెర ఆడియెన్స్ ని ఆద్యంతం ఆకట్టుకున్నాయి. అదే సమయంలో వీరు హోస్ట్ గా చేసిన షోస్ అత్యధిక రేటింగ్ సాధించాయి. యాంకర్లుగా లాస్య, రవిలకు మంచి క్రేజ్, ఇమేజ్ ఏర్పడింది. వీరి మధ్య కెమిస్ట్రీ కూడా అంతే బాగా పండింది. `సంథింగ్ స్పెషల్`, `పటాస్`, `ఆడాళ్ల మజాకా`, `ఆడాళ్లు మీకు జోహార్లు` వంటి షోస్ వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన విషయం తెలిసిందే.
కానీ ఏం జరిగిందో ఏమో ఇద్దరు విడిపోయారు. ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేశారు. యాంకర్ రవి తన వెంటపడ్డాడని, తాను ఒప్పుకుంటే తన భార్యని కూడా వదిలేసేందుకు రెడీ అయ్యాడని, తనపై ఒత్తిడి తెచ్చాడని లాస్య ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో వీరి మధ్య గొడవ తారాస్థాయికి వెళ్లింది. ఆ తర్వాత కొంతకాలం ఇద్దరూ సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు కలిసిపోయారు. తమ మధ్య కేవలం ఈగో సమస్యలే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు లాస్య తనతో బాగానే ఉందని చెప్పారు యాంకర్ రవి.
``ఓ షోలో ఇద్దరు యాంకర్లు ఉన్నారంటే.. ఆ షో పెద్ద హిట్ అయ్యిందంటే.. నా వల్ల, కాదు నా వల్లే అనే క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తుంటాయి. మా మధ్య కూడా అలాంటివే వచ్చాయి. ఈగో ఇష్యూస్ వల్ల మేం కొన్నేళ్లు మాట్లాడుకోలేదు. అవన్నీ చిన్న పిల్లల గొడవలు. ఇప్పుడు మళ్లీ కలిసిపోయాం. మళ్లీ మమ్మల్ని స్టార్ మానే పిలిచింది. ఇద్దరం కలిసి స్టార్ మాలోనే షోలు చేశాం. ఇప్పుడంతా కూల్` అని వెల్లడించారు యాంకర్ రవి. తమ మధ్య ఇప్పుడు ఏ గొడవ లేదనే విషయాన్ని స్పష్టం చేశారు.
అదే సమయంలో ఓ షాకింగ్ విషయాన్ని ఆయన బయటపెట్టారు. సోషల్ పోస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మతిపోయే విషయాన్ని వెల్లడించారు. ఓ యాంకర్ తనపై చేతబడి చేయించిందన్నారు రవి. తాను ఇండస్ట్రీలోకి వచ్చే ముందే అన్ని రకాలుగానూ ప్రిపేర్ అయి వచ్చానని తెలిపారు రవి. పేరు, గుర్తింపు వస్తుందంటే, వాటితోపాటే ఇంకా చాలా వస్తుంటాయని, చాలా జరుగుతుంటాయి, వాటన్నింటిని తట్టుకోవాలనేది ఫిక్స్ అయ్యే వచ్చినట్టు చెప్పారు రవి. ఇక్కడే మరో అసలు విషయాన్ని ఓపెన్‌గా చెప్పారు. తమ బ్యాచ్‌లోనే ఓ యాంకర్ తనపై పూజలు చేయించిందన్నారు.
`మా బ్యాచ్‌లోనే ఒక యాంకర్ నాపై పూజలు చేయించింది. అవి కూడా మామూలు పూజలు కాదు. లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న స్వామి దగ్గరకు వెళ్లి ఆ పూజలు చేయించింది. చేతబడి అంటారు కదా అలాంటిదే. నేను నాశనం అయిపోవాలని ఆ పూజలు చేయించింది. నాకు ఆ విషయం తర్వాత సాలిడ్ సోర్స్ ద్వారా తెలిసింది. నేనూ స్వయంగా చూశాను. అలాంటి క్షుద్ర పూజల్ని నేను నమ్మను కాబట్టి పెద్దగా భయపడలేదు` అని వెల్లడించారు యాంకర్ రవి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరి యాంకర్ రవిపై చేతబడి చేయించిన ఆ లేడీ యాంకర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం యాంకరింగ్‌లో సుమతోపాటు ప్రదీప్, అనసూయ, రష్మి గౌతమ్, శ్రీముఖి, సుడిగాలి సుధీర్, నందు, లాస్య యాంకర్లుగా రాణిస్తున్నారు. బుల్లితెరపై యాక్టీవ్‌గా ఉన్నది వీరే. మరి వీరిలో ఒకరా? లేక వీరు కాకుండా మరో లేడీ యాంకరా? అనేది క్లారిటీ లేదు. రవి మాత్రం ఆ యాంకర్ పేరుని ప్రస్తావించలేదు. ప్రస్తుతం రవి కామెంట్స్ బుల్లితెరపై, ఇండస్ట్రీలోనూ పెద్ద దుమారం రేపుతున్నాయి. అయితే స్వామిజీ మాత్రం వేణు స్వామినే అని అంతా ఫిక్స్ అవుతున్నారు. ఇందులో నిజం ఏంటనేది యాంకర్ రవికే తెలియాలి.