1000 కోట్లకు పైగా ఆస్తి, 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్, సినిమాలు మానేసి ఫ్యామిలీని చూసుకుంటున్న నటి ఎవరు?

Published : Aug 07, 2025, 08:27 AM ISTUpdated : Aug 07, 2025, 08:28 AM IST

ఒకప్పుడు స్టార్ హీరోయిన్, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది. 1000 కోట్లకు పైగా ఆస్తి ఉన్న ఆ హీరోయిన్ 8 ఏళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉంటూ.. ఫుల్ టైమ్ ఫ్యామిలీకే కేటాయించింది. ఇంతకీ ఎవరా నటి?

PREV
15

చిన్న వయసులోనే ఇండస్ట్రీకి

సినీ పరిశ్రమలో చిన్న వయసులో కెరీర్ ప్రారంభించి స్టార్‌గా ఎదిగి, తర్వాత కాలంలో పూర్తి స్థాయిలో సినిమాలకు గుడ్‌బై చెప్పిన తక్కువ మంది హీరోయిన్లలో ఆసిన్ ఒకరు. ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కేవలం 15 ఏళ్ల వయస్సులో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, 16 ఏళ్లకే స్టార్ అయ్యింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటింది. అటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఆసిన్.

DID YOU KNOW ?
చిన్న వయసులోనే హీరోయిన్ గా
ఆసిన్ చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్లకే మోడల్ గా మారిన ఆమె, 16 ఏళ్లకు స్టార్ హీరోయిన్ అయ్యింది.
25

కేరళలోని కొచ్చిలో జన్మించిన ఆసిన్, చిన్ననాటి నుంచే క్లాసికల్ డాన్స్, నాటకాలపై ఆసక్తితో ఉండేది. మోహినీయాటం, భరతనాట్యంలాంటి సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ పొందిన ఆమె, మోడలింగ్ ద్వారా సినిమాల ప్రపంచంలోకి అడుగు పెట్టింది. 2001లో వచ్చిన ఓ మలయాళ సినిమా ద్వారా ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతరువాత సౌత్ ఫిల్మ్స్ లో స్టార్ గా మారింది.

35

టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాలు

2003లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆసిన్, తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. తెలుగులో ఎంట్రీ ఇవ్వడంతోనే ఫస్ట్ సినిమాకే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు తీసుకొచ్చింది ఆసిన్. ఆతరువాత వెంకటేష్, రవితేజ, నాగార్జున, కమల్ హాసన్, సూర్య లాంటి సౌత్ స్టార్ హీరోలతో పాటు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ సరసన కూడా నటించి మెప్పించింది. ఆసిన్ ఫిల్మ్ కెరీర్ లో గజినీ, దశావతారం లాంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. ఏ ఇండస్ట్రీకి వెళ్లినా అక్కడ స్టార్ హీరోయిన్ గా జెండా ఎగరేసింది ఆసిన్.

45

ఆసిన్ పెళ్లి, ఫ్యామిలీ లైఫ్

ఫిల్మ్ ఇండస్ట్రీలో తన కెరీర్ పీక్ లో ఉండగానే ఫ్యామిలీ లైఫ్ వైపు టర్న్ అయ్యింది ఆసిన్. హీరోయిన్ గా ఇంకా సినిమాలు చేయాల్సిన ఏజ్ ఉండగానే వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మతో ప్రేమలో పడిన ఆమె, కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత 2016లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పింది ఆసిన్. తన టైమ్ అంతా ఫ్యామిలీ కే ఇచ్చేసింది.

ప్రస్తుతం ఆసిన్ కుటుంబంతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఆమెకు రాహుల్ శర్మతో ఆరిన్ అనే కుమార్తె ఉంది. సోషల్ మీడియాలో కూడా తక్కువగా కనిపించే ఆసిన్, తన కూతురు పుట్టినరోజు సందర్భంగా మాత్రమే ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం భర్త, కుటుంబం మాత్రమే తన ప్రపంచంగా మార్చుకున్న ఆసిన్, ఎటువంటి సినిమా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడంలేదు.

55

ఇండస్ట్రీలో క్రమశిక్షణ కలిగిన నటి

ఆసిన్ వ్యక్తిగత జీవితంతో పాటు హీరోయిన్ గా కూడా చాలా క్రమశిక్షణతో ఉండేవారు. హీరోయిన్ గా తను జీవితంలో సంపాదించిన ఆదాయాన్ని వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఆర్ధికంగా కూడా మంచి ప్లానింగ్ తో వెళ్లడం వల్ల ఆసిన్ ఆస్తులు కూడా భారీగా పెంచుకుంటూ వెళ్లింది. తాజా అంచనాల ప్రకారం, ఆమెకు 1000 కోట్లకు పైనే ఆస్తి ఉన్నట్టు సమాచారం.

చిన్న వయసులో కెరీర్ ప్రారంభించడంతో పాటు చిన్న వయస్సులోనే స్టార్‌డమ్ కూడా సంపాదించిన ఆసిన్ సినిమాలకు గుడ్‌బై చెప్పి, హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ప్రస్తుతం ఒకప్పటి హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తుండగా.. ఆసిన్ కూడా రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాని ఆసీన్ మాత్రం ఇంత వరకూ ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. మళ్లీ ఆమె సినిమాల్లోకి వస్తుందన్న నమ్మకం కూడా లేదు.

Read more Photos on
click me!

Recommended Stories