మెగా డాటర్ నిహారికకు పరిచయం అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి, తర్వాత సినిమాల్లో కి అడుగుపెట్టింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన నిహారిక.. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా కూడా మారింది. రీసెంట్ గా కమిటీ కుర్రాళ్లు సినిమాతో ప్రొడ్యూసర్ గా హిట్ కొట్టిన ఈ మెగా డాటర్.. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తుతోంది.
23
స్నేహితురాలితో కలిసి యూట్యూబ్ ఛానెల్..
తన అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ఈసారి నిహారిక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించనుంది. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా ప్రకటించడం విశేషం. తన స్నేహితురాలు అంబటి భార్గవి తో కలిసి తాను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ఇద్దరూ ఒకరినొకరు ఎత్తుకున్న ఫోటోలు షేర్ చేసి మరీ.. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించింది.
‘ఈ ఫ్రెండ్ షిప్ ఫుల్ బ్లోన్ యూట్యూబ్ చానల్ గా మారనుంది.సిస్టర్ హుడ్ ఎనర్జీని మీ ముందుకు తీసుకురాబోతున్నాం’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ యూట్యూబ్ ఛానెల్ తో మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అందనున్నాయని చెప్పింది. కాగా.. ఫ్యాన్స్ అందరూ నిహారికకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు.
33
ఓ వైపు నిర్మాతగా.. మరో వైపు యూట్యూబ్ వైపు అడుగులు..
నిహారిక, అంబటి భార్గవితో పాటు... వితికా శెరు, మహాతల్లి జాహ్నవి మొత్తం నలుగురు మంచి స్నేహితులు. ఈ నలుగురిలో మహాతల్లి జాహ్నవికి ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఆమె యూట్యూబ్ లో చాలా ఫేమస్. ఇక.. వితికా శెరు కి కూడా స్పెషల్ గా ఓ ఛానెల్ ఉంది. ఆమె వీడియోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. రెండు, మూడు సార్లు.. వితికా తన ఛానెల్ లో తన స్నేహితులు అందరినీ చూపించింది కూడా. వీరి ప్రభావంతో అనుకుంట.. ఇప్పుడు నిహారిక, అంబటి భార్గవి ఇద్దరూ యూట్యూబ్ మొదలుపెడుతున్నారు.
ఓ వైపు నిర్మాతగా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న నిహారిక.. ఇలా యూట్యూబ్ మొదలుపెట్టడం ఆమె ఫ్యాన్స్ కి ఆనందాన్ని ఇస్తుంది. మరి, ఈ ఛానెల్ లో ఆమె ఎలాంటి కంటెంట్ ని అందించనున్నారో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇప్పటి వరకు అయితే.. తన యూట్యూబ్ ఛానెల్ పేరు ఇంకా ప్రకటించలేదు.