కాబోయే భర్తపై యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఇండైరెక్ట్ గా సుడిగాలి సుధీర్ అనే చెప్పిందా.!

First Published | Jul 17, 2023, 5:18 PM IST

యాంకర్ రష్మీ బుల్లితెరపై సందడి చేస్తోంది. అయితే ఎప్పటి నుంచో ఈ ముద్దుగుమ్మ సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందని రూమర్లు వస్తున్నాయి. తాజాగా తనకు కాబోయే వాడి గురించి మనసులోని మాట చెప్పింది. 
 

బుల్లితెర స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam)  తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘జబర్దస్త్’ షోతో టీవీ ఆడియెన్స్ లో మంచి ఫేమ్ దక్కించుకుంది. దీంతోనే అటు సినిమాల్లోనూ అవకాశాలు సొంతం చేసుకుంటోంది. 
 

ఇదిలా ఉంటే.. యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ఇప్పటికీ అభిమానుల్లో ఇంట్రెస్టింగ్ గానే ఉన్న విషయం ఆమె పెళ్లి  ఎప్పుడనేదే. ఇప్పటి వరకైతే రష్మీ గౌతమ్, కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్ తో ప్రేమయాణం నడిస్తుందని రూమర్లు వినిపిస్తున్నాయి. 


ఏకంగా బుల్లితెరపైనే వీరిద్దరి మధ్య రొమాన్స్, డాన్స్, ఎమోషనల్ డైలాగ్స్, లవ్ సీన్స్ ను చూపించారు. దీంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని అభిమానులు, టీవీ ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై ఎప్పుడూ వీరు అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ పరోక్షంగా మాత్రం తమ ఫీలింగ్స్ ను చెబుతున్నారు. 
 

తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ తనకు కాబోయే భర్త గురించి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ప్రతి ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీలో రష్మీ సందడి చేస్తోంది. ఈవారం ఎపిసోడ్ లో తమకు కాబోయే భర్తలపై సీరియల్ నటీమణులతో పాటు యాంకర్ రష్మీ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

రష్మీ గౌతమ్ మాట్లాడుతూ.. ‘నాకు కాబోయే వాడు.. చెప్పిందే చేయాలి. చేసిందే చెప్పాలి’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో కొందరు అభిమానులు అప్పట్లో సుడిగాలి సుధీర్ ’హీరో’ అంటూ డైలాగ్స్ చెప్పిన విషయం తెలిసిందే. చివరిగా హీరోగా సినిమాలు చేస్తున్నాడుగా అంటూ రష్మీ కామెంట్లను సూచిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 
 

ఇక రష్మీ మనస్సులో సుడిగాలి సుధీర్ మాత్రమే ఉన్నాడని మరోసారి ఇలా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందేమోనని అంటున్నారు. ఇక రష్మీ చేసుకోబోయే వాడిని ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి. బుల్లితెరపై సందడి చేస్తూనే అటు సినిమాలతోనూ అలరిస్తోంది. ప్రస్తుతం చిరు నటించిన ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!