అనసూయను అప్పట్లో ఆదుకున్నాను అంటున్న ఫేడ్ అవుట్ యాంకర్!

First Published Jan 9, 2021, 3:08 PM IST

ఒకప్పట్లో యాంకర్స్ అంటే సుమ, ఝాన్సీ మరియు ఉదయభానునే. వీరి తరువాత జనరేషన్ లో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు భార్గవి. అందమైన రూపంతో పాటు ఆకట్టుకొనే మాటతీరు కలిగిన భార్గవి సక్సెస్ ఫుల్ యాంకర్ గా పలు కార్యక్రమాలకు హోస్ట్ గా ఉన్నారు. అప్పట్లో సుమ, ఝాన్సీ మరియు ఉదయభాను మధ్య తీవ్ర పోటీ నడుస్తూ ఉండేది. 
 

స్టార్ యాంకర్స్గా వాళ్ళువెలిగిపోతున్న రోజులలోభార్గవి సైతం కొన్ని ఆఫర్స్ దక్కించుకొనిసత్తా చాటారు. కాగా తాజా ఇంటర్వ్యూలోయాంకరింగ్ రంగంలోఅప్పటి, ఇప్పటి పరిస్థితులనుతలచుకుంటూపలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా యాంకర్ అనసూయ గురించి కొన్ని విషయాలుఆమె తెలియజేశారు.
undefined
అప్పట్లో భార్గవి చాలా బిజీగా ఉండేవారట. లెక్కకు మించి ఆఫర్స్, ఈవెంట్స్ వస్తున్న నేపథ్యంలోతనకు ఖాళీ లేకపోయితే అనసూయకు ఫోన్ చేసి చెప్పేవారట. తనకు వచ్చే అవకాశాలనుఅనసూయకుపలుమార్లు ఫోన్ చేసి అప్పగించినట్లు భార్గవి తెలిపారు.
undefined
దానికి కారణం తమ సీనియర్స్ అయిన సుమ, ఝాన్సీ వంటివారని భార్గవి తెలిపారు. అప్పట్లో తమ సీనియర్ యాంకర్స్ సుమ, ఝాన్సీ జూనియర్స్ కి అవకాశాలు ఇప్పించి ప్రోత్సహించారట. వాళ్ళు బిజీగా ఉంటే ఏదైనా ఆఫర్ వస్తే భార్గవికి ఫోన్ చేసి చెప్పేవారట.
undefined
అందుకే అప్పట్లో అంతగా అవకాశాలు లేని అనసూయకు పలు ఈవెంట్స్ ఇప్పించినట్లు భార్గవి తెలియజేశారు.మన సహాయం పొందినవారుమంచి స్థాయికి ఎదగడం సంతోషం అని ఆమె అన్నారు.
undefined
భార్గవి నటిగా కూడా పలు చిత్రాలలో నటించారు. పవన్ కళ్యాణ్ నటించినఅత్తారింటికి దారేది, ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ మూవీలో కూడా భార్గవి నటించడం జరిగింది. ఈ మధ్య వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కినమర్డర్ మూవీలో కీలక రోల్ చేశారు.
undefined
click me!