నటి, యాంకర్ అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తరచుగా వార్తల్లో ఉండే సెలబ్రిటీలలో అనసూయ ఒకరు. బుల్లితెరపై సత్తా చాటిన అనసూయ ఆ తర్వాత సినిమాల్లో కూడా తన మార్క్ ప్రదర్శించింది. రంగస్థలం తర్వాత అనసూయని అభిమానులు ముద్దుగా రంగమ్మత్త అని పిలవడం ప్రారంభించారు.
నటిగా అనసూయ క్రేజ్ ని రంగస్థలం చిత్రం మరో స్థాయికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఆమెకి అనేక అవకాశాలు వచ్చాయి. దీంతో అనసూయ నెమ్మదిగా బుల్లితెరకు దూరం అవుతూ వచ్చింది. నటిగా బిజీగా ఉండడంతో టీవీ షోలకు స్వస్తి చెప్పింది. అయితే ఇటీవల అనసూయ సినిమాల్లో నటిస్తూనే అప్పుడప్పుడు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా మెరుస్తోంది.
అనసూయ ఏం చేసినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఖాయం. అంతలా ఆమెని ప్రేక్షకులు ఫాలో అవుతుంటారు. తన గ్లామర్ తో యువతని ఆకర్షించిన అనసూయ ఇప్పుడు నటనతో కూడా మెప్పిస్తుంది.
టాలీవుడ్ లో మంచి రెమ్యూనరేషన్ అందుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనసూయ గుర్తింపు పొందింది. అనసూయ ఒక రోజు షూటింగ్ కోసం 3 నుంచి 4 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. కొత్త లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన అనసూయ అందులోకి ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేసింది. గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలని అనసూయ అభిమానులతో పంచుకుంది. గృహప్రవేశం కోసం అనసూయ, భరద్వాజ్ దంపతులు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి పిల్లలు కూడా పాల్గొన్నారు.
అనసూయ కుటుంబం మొత్తం సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్నారు. తన కొత్త ఇంటి గృహప్రవేశం సందర్భంగా అనసూయ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆ సీతారామాంజనేయ కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, మీ అందరి ప్రేమతో.. మా జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది.
మా కొత్త ఇంటికి 'శ్రీరామ సంజీవని' అని పేరు పెట్టాం అంటూ అనసూయ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీముఖి, మీనాక్షి చౌదరి, గాయత్రి భార్గవి ఇలాంటి సెలబ్రిటీలంతా అనసూయకి శుభాకాంక్షలు తెలిపారు.
అనసూయ చివరగా పుష్ప 2, రజాకార్ అనే చిత్రాల్లో నటించింది. మరికొన్ని చిత్రాలు లైనప్ లో ఉన్నాయి. అనసూయ తన కొత్త ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టడంతో నెటిజన్ల మనసు దోచుకుంది. కొత్త ఇంటి పేరు భక్తి భావంతో చాలా బాగుందని నెటిజన్లు అంటున్నారు.
అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా ఆమె షేర్ చేసే గ్రామర్ ఫొటోస్ తక్కువ వైరల్ అవుతుంది. తన గ్లామర్, నటన అదే విధంగా వివాదాల వల్ల కూడా అనసూయ టాలీవుడ్ లో క్రేజీ సెలబ్రిటీగా మారిపోయింది.