అమర్ దీప్ కి ఫ్రెండ్ గా అరియానా, శోభా శెట్టికి ఫ్రెండ్ గా టేస్టీ తేజా, విష్ణుప్రియకు ఫ్రెండ్ గా పృథ్వీ వచ్చారు. మొదట పృథ్వీ.. విష్ణు ప్రియ గురించి మాట్లాడుతూ ‘ మనిషిమీద పెట్టే ఎఫర్ట్ ని.. వర్క్ మీద పెట్టి ఉంటే తను అనుకున్నది జరిగి ఉండేది’ అని చెప్పాడు.
ఆ తర్వాత శోభాశెట్టి ఏమోషనల్ అవ్వడం విశేషం. టేస్టీ తేజ గురించి మాట్లాడుతూ ‘ నాకు ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది. నేను నీకు ఒక ఫ్రెండ్ గా ఎడిక్ట్ అయిపోయాను. నీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నా అదృష్టం. తేజ లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ ఉండాలని కోరుకుంటాను’ అని చెప్పింది. ఇక.. తేజ కూడా.. ‘ శోభా లాంటి అమ్మాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో భార్యగానో, చెల్లిగానో, కూతురిగానో, ఫ్రెండ్ గానూ ఉండాలి’ అని చెప్పాడు.
తేజ, శోభాశెట్టి ఇద్దరూ బిగ్ బాస్ సీజన్ 7లో స్నేహితులుగా మారారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది.