చిరంజీవి నటించిన ఓ చిత్రం సూపర్ హిట్ కావడానికి పరోక్షంగా అల్లు అర్జున్ కారణం అయ్యాడు. ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్న టైంలో డైరెక్టర్ అలిగి వెళ్లిపోయారట. ఆ మూవీ ఏంటి, ఆ దర్శకుడు ఎవరు అనే విశేషాలు ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ కాంబినేషన్ లో బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. జయంత్ సి పరాన్జీ ఓ ఇంటర్వ్యూలో బావగారు బాగున్నారా చిత్రం తెరవెనుక జరిగిన సంగతులని పంచుకున్నారు. ఆ చిత్రం ప్రారంభం కావడానికి ముందు చాలా పెద్ద హంగామానే జరిగిందట.
DID YOU KNOW ?
ఆ మూవీ చేయొద్దని చిరంజీవికి చెప్పిన డైరెక్టర్
చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రానికి కూడా జయంత్ సి పరాన్జీనే దర్శకుడు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. అయితే శంకర్ దాదా జిందాబాద్ చిత్రానికి మాత్రం ప్రభుదేవా డైరెక్టర్. శంకర్ దాదా జిందాబాద్ వర్కౌట్ కాదని, చేయవద్దని జయంత్ చిరంజీవికి ముందుగానే చెప్పారు.
25
అలిగి వెళ్లిపోయిన డైరెక్టర్
జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ.. పరుచూరి బ్రదర్స్ కథ రెడీ చేశారు. అయితే వాళ్ళు చెప్పిన వెర్షన్ నాకు ఏమాత్రం నచ్చలేదు. చాలా ఆర్గుమెంట్ జరిగింది. చివరికి ఈ కథతో నేను సినిమా చేయలేను అని చెప్పి అలిగి వెళ్ళిపోయాను. మళ్ళీ చిరంజీవి గారు నన్ను పిలిపించారు. అలా అలిగి వెళ్ళిపోతే ఎలా.. నీకు ఏం నచ్చలేదో చెప్పు మార్పులు చేద్దాం అని అన్నారు. కథ చెప్పిన విధానం చాలా పాత పంథాలో ఉన్నట్లు ఉంది.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా లేదు అని చెప్పా.
35
కథలో మార్పులు
ఆ తర్వాత కథని న్యూజిలాండ్ బ్యాక్ డ్రాప్ లోకి తీసుకువెళదాం అని చెప్పాను. పరుచూరి బ్రదర్స్ చెప్పిన వెర్షన్ లో బ్రహ్మానందం కామెడీ సీన్స్ కూడా లేవు. అది కూడా నేనే యాడ్ చేశాను. నేను సూచించిన మార్పులకు చిరంజీవి గారు ఒకే చెప్పారు. ఆ మూవీలో చిరంజీవి గారు చెక్ పాంట్స్ ధరించారు. సౌత్ లో అలాంటి ప్యాంట్స్ ధరించిన మొదటి హీరో చిరంజీవి గారే. ఆ టైంలో బాలీవుడ్ లో ఒకరిద్దరు మాత్రమే అలాంటి ప్యాంట్స్ ధరించేవారు.
చెక్ ప్యాంట్స్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ మూవీలో మీరు ఆ ప్యాంట్స్ వేసుకోవాలి అని చిరంజీవి గారికి చెప్పా. ఆయన వెంటనే ఏంటి నన్ను జోకర్ ని చేయాలనుకుంటున్నావా అని అరిచారు. చిరంజీవి గారిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తున్న టైం ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పుడే అల్లు అర్జున్ ఆస్ట్రేలియా నుంచి ల్యాండ్ అయి చిరంజీవి గారి ఇంటికి వచ్చాడు.
55
పరోక్షంగా కారణమైన అల్లు అర్జున్
బన్నీ ఆ టైంలో కాలేజీలో చదువుకుంటున్న కుర్రాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బన్నీ చెక్ ప్యాంట్ ధరించి కనిపించాడు. వెంటనే చిరంజీవి గారికి చూపించి చూడండి సార్.. ఇప్పుడు యంగ్ స్టర్స్ అందరూ ఇలాంటి ప్యాంట్స్ వేసుకుంటున్నారు అని చెప్పా. దీనితో చిరంజీవి అంగీకరించారు. ఆ విధంగా జయంత్ సి పరాన్జీ సూచించిన మార్పుల వల్ల బావగారు బాగున్నారా చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో రంభ, రచన బెనర్జీ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చిరంజీవి డూప్ లేకుండా బంగీ జంప్ చేయడం విశేషం.