EPIC Trailer: ఎపిక్ ట్రైలర్ రివ్యూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కెమిస్ట్రీ అదిరిందిగా.. హిట్ కొట్టేసినట్లేనా

Published : Sep 04, 2026, 10:23 PM IST

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ విడుదలైంది. కాలేజ్ లైఫ్, ప్రేమ, స్నేహం, భావోద్వేగాలతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

PREV
15
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ విడుదల

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. సరదా, స్నేహం, ప్రేమ, భావోద్వేగాలతో పాటు ఓ అసంపూర్తి ప్రేమకథను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.

25
విదేశీ కాలేజ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ కథ

డెబ్యూ దర్శకుడు ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విదేశాల్లోని కాలేజ్ జీవితాన్ని నేపథ్యంగా తీసుకుంది. అక్కడి యువతలోని అమాయకత్వం, అల్లరి, స్నేహాలు, ప్రేమలు, అనుబంధాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. కాలేజ్ జీవితంలో ఎదురయ్యే సరదా సంఘటనలు, స్నేహితులతో గడిపే క్షణాలు కథలో ప్రధానంగా కనిపించనున్నాయి.

35
ఆనంద్, వైష్ణవి కెమిస్ట్రీ హైలైట్

ట్రైలర్‌లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొదట్లో ఎంతో సరదాగా, రిలేటబుల్‌గా సాగే వారి ప్రేమ ప్రయాణం అనూహ్యమైన మలుపు తీసుకోవడంతో కథలో ఎమోషనల్ డెప్త్ కనిపిస్తోంది. ముఖ్యంగా వారి ప్రేమకథ అసంపూర్తిగా మిగిలిపోవడానికి కారణమేంటి? అనే ప్రశ్నను ట్రైలర్ ఆసక్తికరంగా వదిలి సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.

45
ప్రేమతో పాటు స్నేహం, భావోద్వేగాలు

రొమాన్స్, హ్యూమర్, యూత్‌ఫుల్ ఎనర్జీ, ఎమోషన్స్‌ను చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ట్రైలర్‌ను రూపొందించారు. ఇది కేవలం ఓ ప్రేమజంట కథ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి కాలేజ్ రోజులను, స్నేహాలను, తొలి ప్రేమను గుర్తుచేసే కథ అని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. రిలేటబుల్ సన్నివేశాలు, భావోద్వేగభరితమైన క్షణాలతో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తమ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు.

55
ప్రమోషన్స్‌తో పెరుగుతున్న బజ్

ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌తో ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. కాలేజ్ విజిట్స్, సిటీ టూర్స్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తూ చిత్ర బృందం సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories