Ashika Ranganath: రవితేజ హీరోయిన్ కొత్త లుక్ వైరల్, ఇంటర్నెట్ ని ఊపేస్తున్న ఫోటోలు ఇవే

Published : Sep 04, 2026, 10:10 PM IST

ఆషికా రంగనాథ్ కొత్త ట్రెండీ లుక్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 'అమిగోస్', 'నా సామి రంగ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ బ్యూటీ సుపరిచితమే.

PREV
16
ఆషికా రంగనాథ్
కన్నడ సోయగం, శాండల్‌వుడ్ మిల్కీ బ్యూటీ ఆషికా రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు మరోసారి తన కొత్త లుక్‌తో వార్తల్లో నిలిచింది.
26
కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో ఎంట్రీ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 'అమిగోస్' సినిమాతో ఆషికా రంగనాథ్ తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'అమిగోస్' పెద్దగా సక్సెస్ కాకపోయినా, ఆషికా మాత్రం యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
36
నటన, గ్లామర్‌కు మంచి మార్కులు
మొదటి సినిమా తర్వాతే ఆషికాకు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి. కింగ్ నాగార్జున నటించిన 'నా సామి రంగ' సినిమాలోనూ హీరోయిన్‌గా కనిపించి మెప్పించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించకపోయినా, ఆషికా నటన, గ్లామర్‌కు మంచి మార్కులు పడ్డాయి.
46
రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'

ఇటీవల రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో ఆషికా రంగనాథ్ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతోనూ ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆమెకు ఇంకా ఒక పెద్ద కమర్షియల్ హిట్ పడాల్సి ఉంది. ప్రస్తుతం 'సర్దార్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

56
సోషల్ మీడియాలో యాక్టివ్‌
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఆషికా రంగనాథ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫొటోలను, స్టైలిష్ లుక్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ట్రెండీ డ్రెస్‌లో దిగిన తన క్యూట్ ఫొటోలను షేర్ చేసింది.
66
ఆషికా కొత్త లుక్‌కు అభిమానులు ఫిదా

విభిన్నమైన హెయిర్‌స్టైల్, స్టైలిష్ అవుట్‌ఫిట్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కెమెరాకు పోజులిచ్చిన ఆషికా కొత్త లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమాల్లో నటనతో, సోషల్ మీడియాలో గ్లామర్ లుక్‌తో ఆషికా రంగనాథ్ ప్రస్తుతం మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories