'అరసన్' సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయినట్లు సమాచారం. అంతేకాకుండా, వెట్రిమారన్ పాపులర్ ఫిల్మ్ 'వడ చెన్నై' కాలానికి దగ్గరగా ఉండే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని అంటున్నారు. దీంతో 'వడ చెన్నై' ప్రపంచానికి, 'అరసన్' సినిమాకు ఏదైనా సంబంధం ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.
ఈ సినిమాలో శింబుతో పాటు ఆండ్రియా, సముద్రఖని వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. వెట్రిమారన్ దర్శకత్వం, శింబు నటన, అనిరుధ్ సంగీతం వంటి బలమైన కాంబినేషన్ సెట్ అవ్వడంతో 'అరసన్' సినిమా ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.