25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయిన సినిమా..? ఆర్ఆర్ఆర్, బాహుబలి కాదు.. ఎక్కువ మంది చూసిన మూవీ ఏదో తెలుసా...?

First Published Jun 23, 2024, 2:30 PM IST

దేశంలోనే ఎక్కువవంది చూసిన సినిమా..? రికార్డ్ లు మీద రికార్డ్ లు సాధించిన సినిమా... 25 కోట్ల టికెట్లు అమ్ముడుపోయిన ఆ భారీ సినిమా ఏదో మీకు తెలుసా..? 
 

గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జవాన్ సినిమా. భారతదేశంలో 4 కోట్ల టిక్కెట్లతో సహా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయని అంచనా. కానీ అంతకు ముందు ఆర్ఆర్ఆర్, బాహుబలి, కెజియఫ్ లాంటి సినిమాలు కూడా రకరకాల రికార్డ్ లను క్రియేట్ చేశాయి. కాగా మన దేశంలోనే ఎక్కువమంది చూసిన సినిమా మాత్రం వీటిలో ఏదీ కాదు. 

30 లక్షల బడ్జెట్.. 12 కోట్లు కలెక్ట్ చేసిన ఉదయ్ కిరణ్ సినిమా ఏదో తెలుసా..?

అవును. అత్యధికంగా వీక్షించిన భారతీయ సినిమాల్లో ఒకటి ఉంది. 25 కోట్లకు ఈ సినిమా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అయితే మొదట్లో ఈ సినిమా ఫ్లాప్‌గా భావించారు. కాని ఆసినిమానే రికార్డ్ లను తునా తునకలు చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన షోలే సినిమా ఇది. ఈ సినిమా అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది. 

వందల కోట్లకు వారసురాలు.. తనకంటే చిన్నవాడితో ప్రభాస్ హీరోయిన్ ప్రేమాయణం..?
 

Latest Videos


Image: Still from the movie

మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ సినిమా ఇండియాలో బాక్సాఫీస్‌ వద్ద హిట్‌గా నిలిచింది. ఇది 10 సంవత్సరాలకు పైగా భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సాధించింది. షోలే 1975లో విడుదలైన తర్వాత భారతదేశంలో 15 కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయని అంచనా. కొన్నేళ్లుగా మళ్లీ విడుదల చేయడం తో.. టికెట్ల సంఖ్య 18 కోట్లకు చేరింది. అటు  విదేశాల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. 

సోవియట్ రష్యాలో, ఈ సినిమా ఓపెనింగ్స్ గట్టిగా ఇచ్చింది. స్టార్టింగ్ రన్ లోనే  48 మిలియన్ (4.8 కోట్లు) టిక్కెట్లు అమ్ముడైంది మరియు తిరిగి విడుదలైన తర్వాత 6 కోట్లు అమ్ముడైంది.యూరప్ మరియు ఉత్తర అమెరికా తో కలుపుకుని.. అటు ఆసియా వ్యాప్తంగా షోలేకు 2 కోట్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయినట్లు సమాచారం. దాంతో ఈ సినిమా 25 కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం.

ఎన్టీఆర్, బన్నీ ఓకే.. రామ్ చరణ్ పై మాత్రం కోపంలో ఉన్న ఫ్యాన్స్..? నోరు విప్పాలంటూ మెగా హీరోపై ప్రెజర్..?
 

3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన షోలే అప్పట్లో భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మళ్లీ విడుదలై ఈ చిత్రం . నేటి డబ్బు పరంగా, షోలే ప్రపంచవ్యాప్త కలెక్షన్ రూ.2800 కోట్లుగా అంచనా వేయబడింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 2వ చిత్రం షోలే. దాదాపు 3600 కోట్ల వసూళ్లతో మొఘల్-ఎ-ఆజం అగ్రస్థానంలో ఉంది.

1975లో విడుదలైన షోలే చిత్రానికి తొలిరోజు అంతగా ఆదరణ లభించలేదు. దాంతో ఈ సినిమా పరాజయం పాలైంది. అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, ధర్మేంద్రలతో రమేష్ సిప్పీ అత్యవసర సమావేశం నిర్వహించారు. క్లైమాక్స్‌ని మార్చాలని అనుకున్నారు కానీ సలీం-జావేద్ కొన్ని రోజులు వెయిట్ చేయమని సలహా ఇచ్చారు. వారం రోజుల తర్వాత సినిమా కలెక్షన్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా, ఇది తదనంతరం భారతదేశపు అతిపెద్ద హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 

click me!