చిరుతో కాదు, ప్రభాస్‌తో కాదు.. అమితాబ్‌ బచ్చన్‌ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?

Published : Jan 28, 2025, 06:32 PM ISTUpdated : Jan 28, 2025, 07:59 PM IST

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తెలుగులో విజయ్‌ దేవరకొండతో సినిమా చేయబోతున్నారట. గతంలో `కల్కి 2898 ఏడీ`, `సైరా నరసింహారెడ్డి` చిత్రాలు చేశారు. మరి ఆయన నటించిన ఫస్ట్ తెలుగు సినిమా ఏంటో తెలుసా?  

PREV
15
చిరుతో కాదు, ప్రభాస్‌తో కాదు.. అమితాబ్‌ బచ్చన్‌ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఏదో తెలుసా?

బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆయన తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న తర్వాత బిగ్‌ బీ అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. హీరోగా కంటే ఇప్పుడే ఆయన బిజీగా ఉంటున్నారు. 

25

అమితాబ్‌ ఇప్పుడు మరో తెలుగు సినిమా చేయబోతున్నారట. విజయ్‌ దేవరకొండ చిత్రంలో ఓ కీలక పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ కనిపించబోతున్నారట. దీనికి సంబంధించి ఆయనతో దర్శకుడు రాహుల్‌ సాంక్రిత్యాన్‌ చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అంతేకాదు బిగ్‌ బీ కూడా ఈ మూవీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

`వీడీ14` పేరుతో ఈ చిత్రం రూపొందబోతుంది. ఇటీవలే సింపుల్‌గా పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఓ బలమైన పాత్ర కోసం బిగ్‌ బీని సంప్రదించింది టీమ్‌. మరి ఆయన నటిస్తారా? లేరా? అనేది చూడాలి. 

35

ఈ సందర్భంగా అమితాబ్‌ బచ్చన్‌ తెలుగులో చేసిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా బిగ్‌ బీ ఫస్ట్ టైమ్‌ తెలుగులో ఏ సినిమాలో నటించారు? ఏ హీరోతో నటించారనేది చూస్తే. అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో అశ్వత్థామ పాత్రలో నటించారు.

కల్కిని కాపాడటం కోసం ఆయన కలియుగంలో కూడా బతికే ఉన్న పాత్రలో కనిపించారు. భైరవ పాత్రలో నటించిన ప్రభాస్‌తో ఆయన పోరాట సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ఇందులో పూర్తి స్థాయి రోల్‌ చేశారు ఆయన. ఇంకా చెప్పాలంటే దీనికి ఆయనే హీరో. ఈ మూవీకి పార్ట్ 2 `కల్కి 2`లో కూడా ఆయన ఉండబోతున్నారు. 
 

45

దీనికంటే ముందు మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటించారు. `సైరా నరసింహారెడ్డి` మూవీలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. నరసింహారెడ్డి కి గురవు అయిన గోసాయి వెంకన్న పాత్రలో నటించారు. ఇందులో కూడా దాదాపు సగం సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కనిపిస్తారు. సైరాకి సలహాలిచ్చి గైడ్‌ చేసే పాత్ర ఆయనది.  
 

55

అయితే బిగ్‌ బీ నటించిన మొదటి తెలుగు సినిమా వేరే ఉంది. ఆయన ఫస్ట్ టైమ్‌ `మనం` సినిమాలో మెరిశారు. నాగార్జున, ఏఎన్నార్‌, నాగచైతన్య ఇలా అక్కినేని ఫ్యామిలీ కలిసి నటించిన `మనం` చిత్రంలో గెస్ట్ రోల్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌. ఆసుపత్రి ఛైర్మెన్‌ పాత్రలో ఆయన కనిపిస్తారు. ఓ రకంగా ఇది గెస్ట్ రోల్‌  అని చెప్పొచ్చు.

నాగార్జున అమితాబ్‌ కి మంచి స్నేహితుడు. నాగ్‌ అడగ్గానే ఫ్రెండ్‌ కోసం ఈ రోల్‌ చేశారు. దీనికి పారితోషికం కూడా తీసుకోలేదని టాక్‌. ఇందులో సమంత, శ్రియా హీరోయిన్లు. అఖిల్‌, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి, అమల గెస్ట్ రోల్స్ చేశారు. 2014లో విడుదలైన ఈ మూవీ విశేష ఆదరణ పొందింది. టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచింది. 

read more: `వార్‌ 2`లో మహేష్‌ బాబు, రణ్‌బీర్ కపూర్‌.. ఎన్టీఆర్‌, హృతిక్‌ కోసం ఏం చేస్తున్నారో తెలుసా?

also read: విజయ్ దేవరకొండతో డేటింగ్ పై రష్మిక మందన్న ఓపెన్ కామెంట్స్.. ఏమంది ?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories