తమిళ సినిమాలోని ప్రతిభావంతులైన దర్శకులను బాలీవుడ్ నటులు హిందీలో పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుదేవా, ఎ.ఆర్.మురుగదాస్, విష్ణువర్ధన్ వంటి దర్శకులు బాలీవుడ్‌లో తమ ప్రతిభను చూపించారు. ఇప్పుడు మరో కోలీవుడ్ దర్శకుల బృందం బాలీవుడ్ చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతోంది.
వారు బాలీవుడ్ చిత్రాలను ఇష్టంగా తెరకెక్కించడానికి ప్రధాన కారణం పారితోషికమే. కోలీవుడ్‌లో కన్నా ఎక్కువ పారితోషికం బాలీవుడ్‌లో దక్కుతుంది. బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న తమిళ దర్శకులు ఎవరో చూద్దాం.