`వార్ 2`లో మహేష్ బాబు, రణ్ బీర్ కపూర్ కూడా పార్ట్ అవుతున్నారట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాని, అభిమానులను షేక్ చేస్తున్న వార్త. మరి ఈ ఇద్దరు గెస్ట్ రోల్స్ చేస్తారా? ఏం చేయబోతున్నారనేది చూస్తే, ఈ ఇద్దరు వాయిస్ ఓవర్స్ ఇస్తున్నారట. మహేష్ బాబు తెలుగు వెర్షన్‌కి, రణ్‌బీర్ కపూర్ హిందీ వెర్షన్‌కి వాయిస్ ఓవర్ ఇస్తారట.
సినిమాలో మెయిన్ హీరోలను పరిచయం అవడానికి ముందే వాయిస్ ఓవర్ ఉంటుందని, వీరి వాయిస్ ఓవర్ తోనే హీరోలు పరిచయం అవుతారని తెలుస్తుంది. చాలా పవర్ ఫుల్‌గా ఉండే ఈ వాయిస్ ఓవర్స్ ని ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ తో చేయిస్తున్నారని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ వార్త మహేష్ ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, అటు రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది.
read more: బ్రహ్మానందంలో కామెడీని గుర్తించిన సూపర్ స్టార్ ఎవరో తెలుసా? ఆయన్ని కలవకపోతే లెజెండ్‌ని మిస్ అయ్యేవాళ్లం
also read: అనిల్ రావిపూడికి విజయ్ షాక్, `భగవంత్ కేసరి` రీమేక్ వెనుక జరిగింది ఇదేనా?