ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.