అల్లు శిరీష్ పెళ్లి? టాలీవుడ్ లో ఇంకా బ్యాచిలర్ హీరోలు ఎవరున్నారో తెలుసా?

Published : Sep 27, 2025, 07:37 AM IST

టాలీవుడ్ లో చాలామంది బ్యాచిలర్ హీరోలు ఉన్నారు. ఆ లిస్ట్ లో ఉన్న అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్టు తెలుస్తోంది. మరి తెలుగు పరిశ్రమలో ఇంకా బ్యాచిలర్ లైఫ్ గడుపుతున్న స్టార్ హీరోలు ఎవరు? 

PREV
17
అల్లు ఫ్యామిలీలో పెళ్లి సందడి

మెగా ఫ్యామిలీలో మళ్లీ పెళ్లి సందడి జరగనుందా? టాలీవుడ్‌లో తాజా టాక్ ప్రకారం, మెగా హీరో అల్లు శిరీష్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ విషయంపై చర్చ నడుస్తోంది.మెగా ఫ్యామిలీలో ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టి తండ్రులుగా ప్రమోషన్ కూడా పొందారు. కానీ ఇంకా అల్లు శిరీష్, సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ బ్యాచిలర్స్ గానే ఉన్నారు. అయితే వీరిలో అల్లు శిరీష్ ముందుగా పెళ్లిపీటలెక్కనున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

27
అల్లు శిరీష్‌ పెళ్లి వార్తలు

తాజా సమాచారం ప్రకారం, అల్లు శిరీష్‌కు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో పెళ్లి జరగనుందని సమాచారం. ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తి కావొచ్చని, అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువడవచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గా అల్లు రామలింగయ్య భార్య, కనకరత్నమ్మ మరణించడంతో ఈ పెళ్లికి సబంధించిన పనులు వాయిదా పడినట్టు తెలుస్తోంది.

37
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ

అల్లు శిరీష్, మెగాస్టార్ చిరంజీవి నటించిన హిందీ సినిమా ప్రతిబంధ్ (1990)లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తర్వాత గౌరవం సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఆ తరువాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాల్లో నటించారు. 2023లో విడుదలైన బడ్డీ తరువాత మరో సినిమాలో శిరీష్ నటించలేదు. అయితే ‘బడ్డీ’ తర్వాత శిరీష్ మరే కొత్త ప్రాజెక్టును ఇప్పటి వరకు ప్రకటించలేదు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలోనూ తక్కువగా కనిపిస్తున్నారు, సినీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు.

47
బ్యాచిలర్ హీరోల లీడర్

టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు ఇంకా చాలామంది ఉన్నారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లకు లీడర్ అంటే ప్రభాస్ పేరు ముందు ఉంటుంది. ఆయన పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ప్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు ప్రభాస్. ఎప్పుడు చేసుకుంటాడో కూడా ఎవరికీ తెలియదు.

57
రామ్ పోతీనేనిపై రూమర్లు

టాలీవుడ్ నుంచి మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రామ్ పోతినేని ఉన్నారు. ఆయన కూడా ఇంత వరకూ పెళ్లి ప్రస్తావన లేకుండా హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. మధ్యలో కొంత మంది హీరోయిన్లతో అఫైర్ వార్తలు గుప్పుమన్నా.. అందులో ఏది పెళ్లి వరకూ వెళ్లలేదు. రీసెంట్ గా భాగ్యలక్ష్మి బోర్సే తో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. 37 ఏళ్ల రామ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రామ్ మాత్రం సాలిడ్ హిట్ కోసం చూస్తున్నాడు.

67
విజయ్ - రష్మిక విషయంలో నిజమెంత?

ఇక టాలీవుడ్ స్టార్ హీరోలలో 36 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్ళి చేసుకోని వారిలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. విజయ్ చాలా కాలంగా హీరోయిన్ రష్మికతో ప్రేమలో ఉన్నడని చాలా స్ట్రాంగ్ గా వార్తలు వైరల్ అవుతున్నాయి. కాని వారు మాత్రం ఇంత వరకూ నోరు విప్పలేదు. విజయ్ పెళ్లి గురించి కూడా ఎటువంటి హింట్ ఇవ్వలేదు. అయితే దేవరకొండ దృష్టి అంతా ప్లాప్ ల నుంచి బయటపడాలని, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఆలోచనలోనే ఉంది. ఆతరువాతే విజయ్ పెళ్లిపీటలు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. మరి రష్మికతోనా..? మరెవరితోనైనా అనేది తెలియాల్సి ఉంది.

77
టాలీవుడ్ లో మిగిలిన బ్యాచిర్లు వీరే

వీళ్లే కాదు టాలీవుడ్ లో చాలామంది యంగ్ హీరోలు బ్యాచిలర్స్ గా ఉన్నారు. సందీప్ కిషన్, తరుణ్, అడివి శేష్, రాజ్ తరున్ , సుశాంత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆనంద్ దేవరకొండ ఇలా చాలామంది యంగ్ స్టార్స్ బ్యాచిలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కినేని అఖిల్ రీసెంట్ గా ఓ ఇంటివాడు అయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories