బిగ్ బాస్ ట్విస్ట్, మిడ్ ఎలిమినేషన్ ,బోరున విలపించిన ఇమ్మాన్యుయేల్, నెక్ట్స్ ఏంటి?

Published : Sep 26, 2025, 11:33 PM IST

బిగ్ బాస్ సీజన్ 9 ప్రతిరోజూ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేటషన్లు, గ్రూప్ గొడవలు, డ్రామాలు, ట్విస్టులు చాలా జరుగుతుండగా, తాజా ఎపిసోడ్ లో మిడ్ ఎలిమినేషన్ తో మరో ట్వీస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

PREV
15
ఈ వారం ఎలిమినేషన్ ఎవరు?

ఈ సీజన్‌లో శ్రష్టివర్మ తొలివారంలో ఎలిమినేట్ అయ్యారు. తర్వాత మర్యాద మనీష్ రెండో వారంలో హౌస్‌ను వదిలి వెళ్ళారు. ఇప్పుడు, ఈ వారం ప్రియా శెట్టి హౌస్ నుంచి బయటికివుతారనే ఊహలు సోషల్ మీడియాలో వ్యాపిస్తున్నాయి. ఓటింగ్ ఫలితాలు ఆధారంగా, ప్రజాదరణలో తక్కువ స్థాయిలో ఉండటంతో ప్రియా శెట్టి ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరుగుతోంది.

25
అర్ధరాత్రి బిగ్ బాస్ ట్విస్ట్

ఇది కాకుండా, హౌస్‌లో కామనర్ స్థానాన్ని అందుకున్న శ్రీజా కూడా ఈ వారం నామినేషన్లలో ఉంది. కానీ డిమాన్ ప‌వ‌న్‌ “పుణ్యమా” అని పేరుపొందిన శ్రీజా సేఫ్ అయినట్టు తెలుస్తుంది. శ్రీజా తన గేమ్ స్టైల్, వాయిస్ స్వరంతో ఒక్కో సందర్భంలో అందరిని విసిగిస్తోంది.. ఇక ఈ వారం బిగ్ బాస్ ఒక పెద్ద ట్విస్ట్ ను ప్రవేశపెట్టాడు. గత కొద్ది రోజులుగా ప్రచారం ఊహించబడినట్లుగా, కొత్త కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. శుక్రవారం ఎపిసోడ్‌లోనే మధ్యలో విచారణ జరిగిన ఎలిమినేషన్ ప్రేక్షకులకు షాక్‌ను ఇచ్చింది.

35
మిడ్ వీక్ ఎలిమినేషన్

మిడ్ వీక్ ఎలిమినేషన్ సమయంలో, హౌస్ మేట్స్ నిద్రలో ఉన్న సమయంలో డేంజర్ సైరన్ మోగింది. దాంతో విషయం ఏంటా అని అందరు నిద్రలేచారు. ఈ వారపు ప్రారంభంలో, బిగ్ బాస్ సభ్యుల పేర్లతో సీడ్స్ ఇచ్చాడు. అందులో రెడ్ సీడ్ వచ్చిన వారికి ఒక పవర్ ఇవ్వబడింది. ఇంటి నుండి ఒక కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయగల అవకాశం దక్కించింది. రెడ్ సీడ్ పొందిన సభ్యుల్లో భరణి, మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్, డిమాన్ పవన్, రాం ఉన్నారు. వారిని ఏకాభిప్రాయంతో ఒక పేరు సూచించాలని బిగ్ బాస్ కోరారు.

45
ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్

ఈ ఎంపికలో, మాస్క్ మ్యాన్ హరీశ్ తాను సంజనాను హౌస్ నుండి బయటకు పంపాలని. రాము, డిమాన్ పవన్ కూడా సంజనా పై ఆరోపణలు చేసి, ఆమెను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్‌కు తెలిపారు. మెజారిటీ సభ్యులు సంజనాకు ఓటు వేయడంతో , బిగ్ బాస్ వెంటనే ప్రధాన గేట్ ద్వారా ఆమెను హౌస్ నుంచి బయటకి పంపమని ఆదేశాలు ఇచ్చారు. .అయితే హరీశ్, రాము, డిమాన్ ల మాటలకు సంజనా బాగా ఎమోషనలైంది. తనను కార్నర్ చేసి బయటకు పంపుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను సరదాగా ఉండాలని అనుకుంటున్నాను, నేను నాటీ కానీ టార్చర్ కాదు అని ఆమె అన్నారు. కానీ హౌస్ మేట్స్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది. చివరకు తన లగేజీ బ్యాగ్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇమ్మాన్యుయేల్ మాత్రం ఆమె వెళ్లిపోతున్నప్పుడు గుక్కపెట్టి ఏడ్చాడు.

55
సీక్రెట్ రూమ్ కు సంజన

అయితే ఇక్కడే పెద్ద ట్వీస్ట్ ఉంది. ఈ ఎలిమినేషన్ స్ట్రైట్‌గా కాదు, ఇది బిగ్ బాస్ ఆడించిన ఓ ఆట. సంజనాను వెంటనే సీక్రెట్ రూమ్ కు తీసుకెళ్లారు. అసలు సంజనా ఈ వారం నామినేషన్స్‌లోనే లేదు. ఈ పరిస్థితిలో,ఆమెను నేరుగా ఎందుకు ఎలిమినేట్ చేస్తారు? ఆమెను ఏ ప్రమాణంలో హౌస్ నుంచి పంపారనే విషయం ప్రేక్షకుల్లో సందేహం రేకెత్తించింది.ఈ ట్విస్ట్ విడుదలతో, బిగ్ బాస్ హౌస్‌లోని గేమ్ ప్లాన్, నామినేషన్ల విధాణంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఈ వీక్ అసలు హౌస్ నుంచి వెళ్లబోయేది ఎవరో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories