సావిత్రి తరువాత హీరోయిన్ గా అంతటి పేరు తెచ్చుకున్న నటి సౌందర్య. అవ్వడానికి కన్నడ నటి అయినా సౌందర్యను తెలుగింటి ఆడపడుచుగా ఆదరించారు. తెలుగులో ‘రాజేంద్రుడు, గజేంద్రుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు సౌందర్య. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, శ్రీకాంత్, జగపతి బాబు, లాంటిస్టార్ హీరోలతో, కుటుంబ కథా సినిమాలు చేస్తూ స్టార్ డమ్ ను సాధించింది. ఎక్స్ పోజింగ్ కు ఛాన్స్ లేకుండా, చీరకట్టుతోనే హీరోయిన్ గా ఛాన్స్ లు సాధించిన సౌందర్య.. కట్టు, బొట్టు, నటనతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక స్టార్ హీరోయిన్ గా ఫామ్ లో ఉండగానే 2004లో హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఆమె మరణం ఇండస్ట్రీని తీవ్రంగా కలచివేసింది.