ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ సినిమా నుంచి బన్నీ లుక్ లీక్ అయ్యింది.ఈ లుక్ లో ఐకాన్ స్టార్ ఎలా ఉన్నాడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన 22వ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్‌డేట్స్, విశేషాలు అభిమానుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి.
24
హాలీవుడ్ సంస్థతో గ్రాఫిక్ వర్క్
దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ పనులు ప్రముఖ హాలీవుడ్ సంస్థలచే నిర్వహించబడుతున్నాయి. Avengers, Avatar లాంటి సినిమాలకు వీఎఫ్ఎక్స్ అందించిన పెద్ద సంస్థ ఈసినిమాకు పనిచేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించి విడుదలైన ఓ మేకింగ్ వీడియోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఇటీవలే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
34
అల్లు అర్జున్ ఫోటో లీక్
ఇదిలా ఉండగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ లుక్ ఒకటి వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్స్ లో తీసిన ఈ ఫోటోలో అల్లు అర్జున్ సూపర్ హీరో సూట్ ధరించి, జుట్టును ముడివేసిన స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌ను చూసిన నెటిజన్లు హాలీవుడ్ రేంజ్‌లో బొమ్మ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్‌పై తెగ ఖుషీ అవుతున్నారు.ఈ మూవీ షూటింగ్‌ను మేకర్స్ 2026 మధ్య నాటికి పూర్తి చేసి, 2027లో థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ తొలిసారిగా సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు. ఈ అంశం కూడా సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది.
ఇంకా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా తమిళ యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతికత, గ్రాఫిక్స్ వర్క్‌ను వినియోగించి, ఓ పాన్ వరల్డ్ సినిమాగా రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ లుక్ లీక్ కావడంతో సినిమా మీద క్రేజ్ మరింతగా పెరిగింది. మేకర్స్ అధికారిక పోస్టర్, టైటిల్, మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. AA22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్, అల్లు అర్జున్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది. ఈసారి 2 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే లక్ష్యంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.