OG Trailer Postpone: ఫ్యాన్స్ ని మళ్లీ డిజప్పాయింట్ చేశాడు పవన్ కళ్యాణ్. ఓజీ ట్రైలర్ వాయిదా వేశారు. ఆదివారం ఉదయం రిలీజ్ కావాల్సిన ట్రైలర్‌ని సాయంత్రం విడుదల చేయబోతున్నారు.
`ఓజీ` ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న ఫ్యాన్స్
సినిమా టీజర్లు, ట్రైలర్స్ రిలీజ్ విషయంలో మేకర్స్ ఒక గేమ్ ఆడుతున్నారు. ముందుగా ఒక టైమ్ చెప్పి, ఆ తర్వాత తీరా రిలీజ్ టైమ్‌కి సారీ చెప్పేస్తున్నారు. టెక్నీకల్ రీజన్స్ తో డిలే అవుతుందని, బెటర్ ఔట్‌పుట్ కోసమే కష్టపడుతున్నామని చెబుతూ ఆడియెన్స్, ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తున్నారు. చివరికి ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` విషయంలోనూ జరగడం గమనార్హం. ఈ మూవీ ట్రైలర్‌ని ఈ రోజు(ఆదివారం) పది గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
24
`ఓజీ` మూవీ ట్రైలర్ వాయిదా
`ఓజీ` నుంచి ఇప్పటి వరకు సరైన కంటెంట్ రాలేదు. దీంతో పవన్ అభిమానులు వెయ్యి కళ్లతో ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. రిలీజ్‌కి ఇంకా గంట టైమ్ ఉందనగా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది ప్రొడక్షన్ హౌజ్. ట్రైలర్ వాయిదా విషయాన్ని నెమ్మదిగా చెప్పింది.పైగా పవన్ కళ్యాణ్ నటించిన `గబ్బర్ సింగ్` సినిమాలోని సీన్‌ని పోస్ట్ చేసి, తమపైనే సెటైర్లు వేసుకుంటూ `ఓజీ` ట్రైలర్ వాయిదా విషయాన్ని వెల్లడించడం విశేషం. ఓకే ఓకే మ్యూజిక్ స్టార్ట్ రిప్లైస్, కోట్స్ అంటూ నెటిజన్లని మరింతగా రెచ్చగొట్టేలా పోస్ట్ పెట్టడం గమనార్హం.
34
సాయంత్రం `ఓజీ` కాన్సర్ట్ లో ట్రైలర్ విడుదల
ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ ఎప్పుడనేది వెల్లడించారు. ఈ రోజు(ఆదివారం) సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో ఓజీ మూవీ మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఈ ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు డిజప్పాయింట్ అవుతున్నారు. ఇంతటిదానికి ఇంతహడావుడి ఏంటి? ఈ బ్యాండ్, బాజాలు ఎందుకంటూ ఫైర్ అవుతున్నారు. మీమ్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నాయి. మరి సాయంత్రం విడుదలయ్యే `ఓజీ`ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.
సుజీత్ దర్శకత్వంలో రూపొందిన `ఓజీ`(దే కాల్ హిమ్ ఓజీ)లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఓమీ పాత్రలో నటించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేసింది. ఆమె పాత్ర చుట్టూనే సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ముంబాయ్ గ్యాంగ్ స్టర్ కథతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. `హరి హర వీరమల్లు` ఫెయిల్యూర్ తర్వాత పవన్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో `ఓజీ`పై భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుంటుందా? పవన్‌కి సాలిడ్ హిట్ పడుతుందా అనేది చూడాలి.