మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇక ఈ సినిమా కోసం ఆయన ఓ బాలీవుడ్ హీరోయిన్ ను ఫిక్స్ చేశాడట. అయితే ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గెటప్, ఏఆర్ రెహమాన్ సంగీతంతో పాటు కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ చేయబోయే పాత్ర ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇప్పటికే పెద్ది సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. వరుసగా రెండు ప్లాపులు పడటంతో మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టీమ్.
25
సుకుమార్ తో రామ్ చరణ్ సినిమా
పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో మళ్లీ కలిసి పనిచేయనున్నారు. అధికారిక ప్రకటన ఇప్పటికే ఇచ్చేశారు కూడా. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబోపై మళ్లీ అంచనాలు పెరిగాయి. పుష్ప 2 వంటి గ్లోబల్ హిట్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా అనగానే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెలకొంది. రామ్ చరణ్ సుకుమార్ కాంబో అంటే అందరి చూపు ఇటువైపే ఉంది.
35
రామ్ చరణ్ జోడీగా కృతీ సనన్ ?
ఈ భారీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా బాలీవుడ్ నటి కృతి సనన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో కృతీ సనన్ మహేష్ బాబుకు జోడిగా నటించింది. ఈసినిమాతోనే ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించలేదు. అంతే కాదు బాలీవుడ్ కు వెళ్ళిపోయిన కృతీ.. మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. రీసెంట్ గా ఆమె ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటించింది. కాని ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, మళ్లీ సుకుమార్ కృతిని ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది. కథకు ఆమె పూర్తిగా సరిపోతుందని భావించిన సుకుమార్ ఆమెతో మరోసారి పని చేయాలనుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ వార్తలపై మెగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఎన్ని హిట్స్ ఉన్నా.. టాలీవుడ్ లో ‘వన్ నేనొక్కడినే’, ‘దోచేయ్’, ‘ఆదిపురుష్’ వంటి ప్లాప్ సినిమాలు ఆమె ఖాతాలో ఉండటంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకోవడం సరైందా? అనే చర్చ జరుగుతోంది. కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా కథకు తగ్గ మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. అయితే సుకుమార్ కృతీ సనన్ ను ఎంపిక చేశాడు అనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మూవీ టీమ్ మాత్రం అధికారికంగా ఎటువంటిప్రకటన చేయలేదు.
55
అధికారిక ప్రకటన ఎప్పుడు?
ఇదిలా ఉంటే, రామ్ చరణ్-సుకుమార్ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని సమాచారం. కథ, బడ్జెట్, కాస్టింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సినిమా టైటిల్, ఇతర నటీనటుల వివరాలతో సంబంధిత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.