రజినీకాంత్ మాటలకు షాక్ అయిన అల్లు అర్జున్, ఏదో అనుకుంటే మరేదో అయ్యింది..?

First Published | Aug 16, 2024, 9:40 AM IST

రజినీకాంత్ అల్లు అర్జున్ గురించి కామెంట్ చేయడం ఏంటి..? ఆయన ఏమన్నారు.. అసలు ఏవిషయంలో బన్నీ గురించి కామెంట్ చేశారు.. ఈ విషయాలను ఓ సందర్భంలో వెల్లడించారు ఐకాన్ స్టార్..? ఇంతకీ ఆయన ఏమన్నారంటే..? 

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఏదో కామెంట్ చేశారట. అది బన్నీని షాక్ కు గురిచేసిందట. ఏముంది ఇద్దరు స్టార్లు కాబట్టి.. ఏదో అని ఉంటారు.. అని అనుకోవడానికి లేదు. సూపర్ స్టార్ చేసిన కామెంట్ ఇప్పటిది కాదు.. ఓ పదేళ్ళ క్రితానికి పైగా అన్న మాట. అప్పటికి బన్నీ పెద్ద స్టార్ కానే కాదు.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో మాత్రమే.. ఇంతకీ తలైవా  ఏమన్నారు..? 

పెద్ద సినిమా పెద్ద సినిమా అన్నాడు.. రాజమౌళి ఇలా చేస్తాడనుకోలేదు.. ప్రభాస్ అలా అన్నాడేంటి..?

పాన్‌ ఇండియా స్టార్‌గా, దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.. టాలీవుడ్ కు ఫస్ట్  జాతీయ ఉత్తమనటుడిగా అవార్డ్ తీసుకువచ్చిన హీరో  అల్లు అర్జున్‌. పుష్ప సినిమాతో సరికోత్త రికార్డ్ ను క్రియేట్ చేసిన ఆయన.. పుష్ప2తో అంతకు మించి సాధించడానికి రెడీ అవుతున్నారు. కాగా  బన్నీకి కెరీర్ బిగినింగ్ లో ఓ అనుమానం ఉండేదట. మూడు నాలుగు సినిమాలు చేసిన తరువాత తనను ఎవరైనా గుర్తు పడతారా లేదా అని డౌట్ ఉండేదట. అందుకోసం ఆడియన్స్ లోకి వెళ్ళి.. తనను తాను టెస్ట్ చేసుకునేవాడట కూడా. 

రజినీకాంత్ ప్రియురాలిగా ‌- తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..? షాక్ అవుతారు


ఈ క్రమంలోనే ఆయన ఓసారి సుకుమార్ తో కలిసి చెన్నైకి వెళ్ళారట. అక్కడ రజినీకాంత్ రోబో సినిమా షూటింగ్ జరుగుతుందట. ఆసినిమాకు పనిచేసిన రత్నవేలు ను కలవడానికి వెళ్ళి.. ఆయనతో మాట్లాడి వెళ్ళిపోదాం అనుకున్నారట. అయితే అప్పుడు సెట్స్ లో రజినీకాంత్ ఉండటం.. ఆయన్ను కలవాలని ఆశపడ్డారట బన్నీ. కాని నేను అల్లు అరవింద్‌ అబ్బాయినని చెప్పి గుర్తు చేసి.. మాటకలుపుకుని మాట్లాడటం ఎందుకు అని కామ్ గా వెళ్ళిపోదాం అనుకున్నారట. కాని ఇక్కడే జరిగింది ఓ చిన్న ట్విస్ట్. 
 

ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..

తాము వెళ్ళిపోతుంటేు.. ఓ వ్యక్తి వచ్చి.. రజినీకాంత్ గారు రమ్మంటున్నారు అని పిలిచాడు.. నేను సుకుమార్ తోకలిసి వెళ్ళాను.. నేను సినిమాల్లో నటిస్తున్న సంగతి ఆయనకు తెలుసో లేదో అనుకున్నా.. కానీ ఆయన మాత్రం సినిమాలు బాగా చేస్తున్నావయ్యా లేడిస్‌లో నీకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వుంది. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్‌ సంపాందించుకున్నావు అనే సరికి నేను షాకయ్యాను. స్టయిల్‌కి, క్రేజికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచే రజనీకాంత్‌ నా గురించి అలా మాట్లాడేసరికి ఆక్షణం నాలో తెలియని ఆనందం కలిగింది అని చెప్పుకొచ్చారు.

శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?

అలా సూపర్ స్టార్ రజినీకాంత్ తో తనకు జరిగిన సంఘటనను నెమరు వేసుకున్నారు అల్లు అర్జున్. ఇక ప్రస్తుతం పుష్ప  సీక్వెల్ తోె బిీగా ఉన్న బన్నీ.. ఆతరువాత సందీప్ రెడ్డివంగాతో రచ్చ రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. వీరి కాంబోలో అర్జున్ రెడ్డి మిస్ అయ్యింది. మరిఎలాంటి సినిమా బయటకు వస్తుందో చూడాలి. పుష్ప2 మాత్రం వెయ్యి కోట్లు కలెక్షన్స్ దాటే టార్గెట్ తో కష్టపడుతున్నారు టీమ్. 

Latest Videos

click me!